2018 ప్రకృతి సేద్య నామ సంవత్సరం... ప్రకటించిన సీఎం చంద్రబాబు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

2018 సంవత్సరాన్ని ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులో ప్రకృతి సేద్యంపై వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ ఏర్పాటుచేసిన రైతుల శిక్షణా శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు.

రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో సుభాష్‌ పాలేకర్‌ నేతృత్వంలో 9 రోజులపాటు నిర్వహించే 'ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ'ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముందు ముందు ప్రకృతి సేద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్‌గా ఉంటుందని అన్నారు. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక చిరునామాగా ఉంటుందని ఆయన చంద్రబాబు చెప్పారు.

2018...ఎపికి

2018...ఎపికి

2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నానని, అందరూ దీనిపై శ్రద్ధ పెట్టాని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. లక్షా 50 వేల ఎకరాల్లో ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8వేల మంది రైతులు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు.

వ్యవసాయంలో...ఐటి నిపుణులు...

వ్యవసాయంలో...ఐటి నిపుణులు...

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన 8 వేల మంది రైతుల్లో 300 మంది ఐటి నిపుణులు ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలైన యుఎన్‌డిపి, ఎఫ్‌ఎఒలు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నాయని, జూన్‌ 5న యుఎన్‌డిపితో ఎంఒయు కుదుర్చుకోనున్నామని చెప్పారు. తాను మంచి మార్కెటింగ్‌ మేనేజర్‌ని అని, సుభాష్‌ పాలేకర్‌ మంచి ఉత్పాదకుడని, ఇద్దరం కలిస్తే రైతుల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు

సుభాష్ పాలేకర్ పై ప్రశంసలు...

సుభాష్ పాలేకర్ పై ప్రశంసలు...

సాగు సాఫీగా సాగాలన్నా, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సాధించాలన్నా, ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమని చంద్రబాబు అన్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేశారని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్న చంద్రబాబు, చరిత్ర సృష్టించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

సుభాష్ పాలేకర్ ఏమన్నారంటే...

సుభాష్ పాలేకర్ ఏమన్నారంటే...

వ్యవసాయం అంటే ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని, వ్యవసాయం ఒక సహజసిద్ధమైన జీవనశైలి అని పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. ఆహార ధాన్యాల కొరత, భూతాపం, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న అసాధారణ మార్పులు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నాయన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గ్రామీణ ప్రాంత యువత ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక వ్యవసాయం...

ఆధ్యాత్మిక వ్యవసాయం...

ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాలు మనం కోల్పోయిన ప్రకృతి వనరులను, ప్రకృతి శక్తిని తిరిగి భర్తీ చేసేందుకు దోహదపడ్తాయని తెలిపారు. ఎటువంటి రసాయనాలను వినియోగించకపోయినా అడవుల్లో దొరికే పండ్లు ఎగుమతులకు అనువైనవిగా ఉంటున్నాయన్నారు. అడవిలో నుంచి తీసుకొచ్చి, వాటి ప్రతిరూపంగా ఇంటి వద్ద అలాంటి వ్యవసాయం చేయడమే ఆధ్యాత్మిక వ్యవసాయంగా అభివర్ణించారు. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం 2050 నాటికి భారత జనాభా 160 కోట్లకు చేరుకుంటుందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. రసాయనిక ఎరువులను వినియోగించి ఆహారధాన్యాల ఉత్పత్తి రెట్టింపు చేయడం సాధ్యంకాదని, అలాంటి సాంకేతికత లేదని వివరించారు. కానీ పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెట్టింపు చేయొచ్చని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Chief Minister N. Chandrababu Naidu announced that the AP government would name 2018 as the "Nature Farming Year" and declared that he would be consuming only organic food from the New Year. The CM was speaking after inaugurating subhash palekar's zero-budget natural farming training programme on Sunday. Mr Naidu said that there was a time when only natural farming was done by Indians but over the years, there was a steady increase in the usage of pesticides and this was bad for health.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి