సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన .. అలా అయితే దేశంలో అన్ని ప్రభుత్వాల అధికారాలు తీసెయ్యండి
Recommended Video
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్ లెస్ సీఎం అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుకి అధికారం ఉందా లేదా అన్న అంశంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.

దేశంలో అన్ని ప్రభుత్వాలకు అధికారాలు తీసెయ్యండి అన్న చంద్రబాబు
ఎన్నికల సమయంలో ఏపీ సీఎంకు అధికారాలు లేవని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా దేశంలోని ప్రభుత్వాలన్నింటికీ అధికారాలు తీసేసి సర్వాధికారాన్ని ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయని పేర్కొన్న చంద్రబాబు అసలు తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. అధికారాలు లేని సీఎంగా ఉండాలంటూ వక్రీకరించి చెప్పటం తగదని పరోక్షంగా సీఎస్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు
పార్టీ కార్యకర్తలు, నేతలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము వెయ్యి శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బాబు ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అందరూ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు .

వీవీ ప్యాట్ లపై ఉద్యమిస్తాం ... యాభై శాతం లెక్కించాలని ఢిల్లీలో ధర్నా చేస్తాం అన్న బాబు
ఇక ఏపీ సీఎస్ చేసిన వ్యాఖ్యలు సరి కాదన్న చంద్రబాబు ఈవీఎంలపై, వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాస్తామని చెప్పారు. యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండ్‌తో అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా తమతో కలిసి ముందుకొస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతున్నాయని అన్నారు. మొత్తానికి సీఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి సీఎస్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications