వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ అభినందనలు: ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: వ్యవసాయ రంగంలో రైతుల స్వావలంబన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ నిధి.. రైతులు పండించిన పంటలకు విలువను జోడించేందుకు, స్థిరమైన ఉన్నత స్థాయి ఆదాయాలు పొందడానికి వీలుకల్పిస్తుందని అన్నారు.

మోడీకి అభినందనలు..

మోడీకి అభినందనలు..

కేంద్రం తీసుకొచ్చిన్న ఈ పథకం ద్వారా మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మేరకు సీఎం జనగ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, పీఎం కిసాన్ పథకం కింద ఆరో విడదత నిధులను ప్రధాని మోడీ ఆదివారం విడుదల చేశారు. దీని ద్వారా దాదాపు 8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేల చొప్పున జమ కానున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ. 17వేల కోట్లను విడుదల చేసింది.

ఎనిమిదిన్నర కోట్ల రైతులకు మేలు..

ఎనిమిదిన్నర కోట్ల రైతులకు మేలు..

ఈ ప్రక్రియ మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా ఒకే ఒక్క క్లిక్త‌తో ఎనిమిదిన్నర కోట్ల రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు ప్రధాని తెలిపారు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. విషయం తెలిసిందే. కాగా, ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, పంట సేకరణ కేంద్రాలు ఏర్పాటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులను మంజూరు చేస్తుంది. దీనిలో భాగంగా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా ఆర్థిక సాయం అందనుంది.

Recommended Video

Vijayawada దుర్ఘటన పై సమగ్ర దర్యాప్తు కు Pawan Kalyan డిమాండ్!! || Oneindia Telugu
విజయవాడ ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాతి..

విజయవాడ ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాతి..

ఇది ఇలావుండగా, విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకుంటోన్న సహాయక చర్యల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిదిమంది మరణించడం పట్ల నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.

ప్రమాద మృతులకు పీఎంఆర్ఎఫ్ కింద రూ. 2 లక్షల పరిహారం

విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల పరిహారాన్ని ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఆర్ఎఫ్) ద్వారా అందజేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. గాయపడినవారికి రూ. 50వేలు ఇస్తున్నట్లు వెల్లడించింది.

English summary
ap cm ys jagan congrats to pm modi for launching agri infra fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X