జగన్‌కు అమరావతి రైతుల సెగ: వ్యతిరేక నినాదాల హోరు: సచివాలయానికి వెళ్తోండగా

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకుపైగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న అమరావతి ప్రాంత రైతులు.. మరోసారి రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాాదాలు చేశారు. జై అమరావతి అంటూ హోరెత్తించారు. ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ గళమెత్తారు. ఆకుపచ్చ జెండాలను ప్రదర్శిస్తూ తమ నిరసలను తెలియజేశారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, రోప్ పార్టీని ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

వైఎస్ జగన్ తన కాన్వాయ్‌లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సచివాలయానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయడంపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సమావేశాన్ని సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనడానికి వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు.

 AP CM YS Jagan faces Amaravati farmers protest at the region

మార్గమధ్యలో ఆయన కాన్వాయ్.. వెళ్తోండగా..అమరావతి ప్రాంత రైతులు ఒక్కసారిగా రోడ్డు పక్కన నిల్చుని నిరసనలు తెలిపారు. ఆకుపచ్చ జెండాలను ప్రదర్శించారు. జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి ఆంధ్రుల స్వప్నం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులను దొంగదెబ్బ తీస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితులు తలెత్తవచ్చని గ్రహించిన పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.

 AP CM YS Jagan faces Amaravati farmers protest at the region

అంతకుముందు రోజే- దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను అమరావతి ప్రాంత రైతులు అడ్డుకున్న ఘటన చోటు చేసుకోవడంతో ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. రైతులు నిరసన తెలుపుతారని భావించిన ప్రాంతాల్లో రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. రైతులెవరూ రోడ్డెక్కకుండా, ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీనితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఆయన కాన్వాయ్ సజావుగా సచివాలయం వైపు దూసుకెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+