గవర్నర్ బిశ్వభూషణ్ బదిలీపై వెళ్తోన్న వేళ..జగన్ కామెంట్స్
ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని ప్రశంసించారు.
అమరావతి: రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి, పదవీ విరమణ చేసిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఏపీ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఆయనతో పాటు మొత్తం 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇవ్వాళ నియమితులయ్యారు. వారి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4వ తేదీన పదవీ విరమణ చేశారు. ఆయన స్వరాష్ట్రం కర్ణాటక. 1958లో మూడబిదిరిలోని బెలువాయిలో జన్మించారు. 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. చరిత్రాత్మకమైన బాబ్రీమసీదు-రామజన్మభూ వివాదంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. ఏపీతో మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
ఇక భగత్ సింగ్ కోష్యారి స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ భైస్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కఠారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ అనసూయ నియమితులయ్యారు.
లడఖ్ లెప్టినెంట్ గవర్నర్‌గా బీడీ మిశ్రా నియమితులయ్యారు. గతంలో ఆయన ఆర్మీలో బ్రిగేడియర్ గా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పదవీ విరమణ చేశారు. నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా ఫగు చౌహాన్, బిహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్ అయ్యారు.












Click it and Unblock the Notifications