"జబర్దస్త్" పంచ్ ప్రసాద్ కు సీరియస్ - అండగా ముఖ్యమంత్రి జగన్..!!

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొంత కాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని..కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు దాతలు సహకరించాలని సహచర కమెడియన్ నూకరాజు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. ఇదే సమయంలో మంత్రి రోజా ఈ వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు పంచ్ ప్రసాద్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్..చికిత్స కు పూర్తి సహకారం లభిస్తోంది.

కిడ్నీ సమస్యలతో: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన పంచ్ ప్రసాద్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిరంతరం చికిత్సతో పాటుగా డయాలసిస్ చేయుంచుకుంటున్నారు. తన షోల సమయంలోనే ఈ విషయాన్ని పలు మార్లు వెల్లడించారు. ఇప్పుడు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. జబర్దస్త్ సహ నటులు చికిత్సకు సహకారం అందించారు.

AP CMO Assured support for Punch Prasad Kidney transplantation and Medical treatment

ప్రస్తుతం పరిస్థితి మరింతగా ఆందోళనకరంగా మారటంతో వెంటనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావటంతో కుటుంబ సభ్యులు దాతల కోసం వేచి చూస్తున్నారు. పరిస్థితిని వివరిస్తూ కమెడియన్ నూకరాజు తన సోషల్ మీడియా ఖాతలో వీడియోస్, పోస్టర్స్ షేర్ చేస్తూ హెల్ప్ చేయాలంటూ నెటిజన్స్ ను కోరుతూ బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేశారు.

సహకరించాలని కోరుతూ: కొద్ది రోజులు పంచ్ ప్రసాద్ ఆరోగ్యం పైన వార్తలు వినిపిస్తున్నాయి. సహ నటులు ప్రసాద్ కోసం రంగంలోకి దిగారు. తమ వంతు సాయం చేస్తూనే..ఇతరుల సాయం కోరుతున్నారు. హైపర్ ఆదితో పాటుగా ఇతర కమెడియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా సాయం చేయాంటూ బ్యాంకు వివరాలతో ప్రసాద్ పరిస్థితిని వివరిస్తూ పోస్టింగ్స్ షేర్ చేసారు. దీనిని ఒక నెటిజెన్ ఏపీ సీఎంఓలో వైద్య వ్యవహారాలు పర్యవేక్షించే డాక్టర్ హరిక్రిష్ణకు ట్యాగ్ చేసారు.

దీనికి స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఇప్పటికే తమ టీం లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా పంచ్ ప్రసాద్ కు చికిత్స అందించేందుకు కసరత్తు మొదలు పెట్టిందని వెల్లడించారు. ఇప్పటికే పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో సీఎంవో టీం టచ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏపీ సీఎంఓ అండగా: ఇదే సమయంలో పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి రోజా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ తో పాటుగా చికిత్సకు అవసరమైన ఆర్దిక సాయం అందించేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ప్రసాద్ కు వైద్య సేవల్ని అందిస్తున్నట్లుగా సమాచారం.

ప్రసాద్ వైద్య ఖర్చులన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తోంది.ప్రసాద్ కు కిడ్నీ ఇవ్వడానికి డోనర్ దొరికినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు అతడికి కిడ్నీ ఇవ్వడానికి అతని భార్య ముందుకు వచ్చింది. ఇప్పుడు డోనర్ దొరకడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కోలుకొని తిరిగి రావాలని కుటుంబ సభ్యులు..జబర్ధస్త్ టీం సభ్యులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+