ఎల్లుండి వైఎస్ షర్మిల మరో గ్యారంటీ -మోడీ చెప్పిన చోటే విభజన హామీపై డిక్లరేషన్..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఎన్నికల్లో ఏదో విధంగా కనీస ఉనికి చాటుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అనంతపురంలో ఇందిరమ్మ అభయం పేరుతో నెలకు 5 వేల రూపాయలు పేద కుటుంబాలకు ఇస్తామని తొలి గ్యారంటీ ప్రకటించింది. ఇప్పుడు తిరుపతిలో మరో గ్యారంటీ ప్రకటనకు సిద్దమవుతోంది.
సంక్షేమ కోణంలో తొలి గ్యారంటీ ప్రకటించామని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి 1న తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ ప్రకటిస్తామని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసని, కానీ ప్రత్యేక హోదా సాధన పై ఎవరికీ చిత్తశుద్ది లేదని ఆమె ఆక్షేపించారు. రాజకీయం కోసం హోదా అంశాన్ని వాడుకున్నారంటూ చంద్రబాబు, జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. అధికారంలో వచ్చాక హోదా ఊసే ఎత్తలేదన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే... బీజేపీ పదేళ్లు ఇస్తామని తిరుపతిలో హామీ ఇచ్చిందని షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా,అదే మైదానంలో హోదాపై తాము డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు.చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగారని, అదే వేదికగా మోడీ 10 ఏళ్ల హోదా తో పాటు ఎన్నో హామీలు ఇచ్చారని షర్మిల తెలిపారు. రాష్ట్రాన్ని హర్డ్ వేర్ హబ్ చేస్తామని, పెట్రోలియం రీసెర్చ్ సెంటర్ అని, ఇంధన సంస్థలకు రాష్ట్రాన్ని హెడ్ క్వార్టర్ చేస్తా అన్నారని గుర్తుచేసారు. ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణానికి సహకారం అన్నారని మోడీని విమర్శించారు.
కానీ ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని షర్మిల ఆరోపించారు. మోడీ రాష్ట్రాన్ని మోసం చేస్తే...ఇక్కడ ఉన్న పాలక పక్షం,ప్రతిపక్షం ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. 10 ఏళ్లలో ఒక్క ఉద్యమం చేసింది లేదని, హోదా లేక రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. హోదా పొందిన రాష్ట్రాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాయని, ఉత్తరాంఖడ్ రాష్ట్రంలో 2 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయన్నారు.
972 కిలోమీటర్ తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రం హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు.
హోదా సంజీవని కాకపోతే హోదా ఉన్న మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందాయని చంద్రబాబుకు గుర్తుచేశారు.హోదా వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవని, ఉపాధి అవకాశాలు ఉండేవన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్ లు గా వచ్చేవన్నారు. కేంద్రం ఇచ్చే బడ్జెట్ లో 30 శాతం నిధులు వచ్చేవని, పన్ను మినహాయింపు దక్కుతుందని తెలిపారు. దీంతో ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. జగన్ ఆన్న ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు చెప్పాడని విమర్శించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications