ఏపీ కోవిడ్ హెల్త్ బులిటెన్- టెస్టులు పెరిగాయ్- కేసులూ పెరిగాయ్-24 గంటల్లో 21K
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. కర్ఫ్యూ విధించినా దాని ప్రభావం ఏమాత్రం ఉండటం లేదు. దీంతో గత 24 గంటల్లో 21 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 99 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్యపైనా ఆ ప్రభావం కనిపించింది.
ఏపీలో ప్రభుత్వం తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2923 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్ధానాల్లో అనంతపురం 2804, చిత్తూరు 2630, విశాఖ 2368 ఉన్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 785 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత విజయనగరంలో 965, కర్నూల్లో 991, కడపలో 1036, నెల్లూరులో 1251, గుంటూరులో 1291, శ్రీకాకుళంలో 1466, పశ్చిమగోదావరిలో 1762 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 14.75 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 12.54 లక్షల మంది కోలుకున్నారు. మరో 2.11 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 9580 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనాతో 99 మంది చనిపోయారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పన చనిపోగా.. తూర్పుగోదావరి, ప్రకాశంలో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరిలో 8 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. కర్నూలు, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పన, నెల్లూరులో ఐదుగురు, కడపలో ఇద్దరు మరణించారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications