వైజాగ్ సమ్మిట్ సగం ఫలితం రాబట్టేసిన చంద్రబాబు..! 7.69 కోట్ల రాకకు రెడీ..!
ఏపీలో గత నెలలో కూటమి సర్కార్ విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సద్సస్సు నిర్వహించింది. ఇందులో దాదాపు 14 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఎంవోయూల్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు అంతే స్ధాయిలో శ్రమిస్తోంది. దీని ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా ఎంవోయూలు శంకుస్థాపన బాటలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశంలో రూ.20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇందులోనే ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.

దీంతో విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్దఎత్తున ఏపీకి వస్తున్నాయని ఆయన తెలిపారు. కంపెనీలు స్థాపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాం, వాటి విషయంలో పారదర్శకత పాటిస్తుండడం వల్లనే ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయన్నారు.

20 రోజుల క్రితం విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే ఇప్పటికే రూ.7.69 కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయని సీఎం తెలిపారు. ఈ ఎంఓయూలు అన్నింటికీ ఏయే జిల్లాల్లో ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ భూములివ్వాలనే అంశంపైనా నిర్ణయాలు జరిగాయన్నారు. ఇక మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులకు సూచించారు. 45 రోజుల్లోగా ఎంఓయూలు అన్నింటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. వీలైనన్ని ఎంఓయూలను గ్రౌండింగ్ చేసి దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులను వస్తాయన్నారు. దావోస్ పర్యటనకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. ఎంఓయూల గ్రౌండింగ్‌పై ప్రతీ వారం సీఎస్ సమీక్షించాలని ఆదేశించారు.
-
ఇప్పుడు తిప్పండి చక్రం..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications