పంచాయతీలకు పవన్ పంద్రాగస్టు గుడ్ న్యూస్ ..! ఏకంగా 100 రెట్ల పెంపు..!

ఏపీలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా నిధుల కొరతతో అల్లాడుతున్న పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఇచ్చే నిధుల్ని ఏకంగా 100 శాతం పెంచుతూ కీలక ప్రకటన చేశారు. దీంతో ఈసారి పంచాయతీల్లో ఆ కళ కనిపించబోతోంది. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగిస్తామని కూడా పవన్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గతంలో గ్రామ పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు నామమాత్రపు నిధులు ఇచ్చేవారు. మైనర్ పంచాయతీల్లో కేవలం 100 రూపాయలు, మేజర్ పంచాయతీల్లో 250 రూపాయలు మాత్రమే ఇస్తుండేవారు. ఈసారి వీటిని భారీగా పెంచుతూ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మైనర్ పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకల నిర్వహణకు 100 రూపాయల స్ధానంలో 10 వేలు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు.

ap deputy cm independence day special good news to gram panchayats

అలాగే మేజర్ పంచాయతీల్లో స్వాతంత్ర వేడుకల నిర్వహణకు ఇస్తున్న రూ.250 స్ధానంలో ఏకంగా రూ.25 వేలు ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. ఈ నిధులతో ఈసారి ప్రతీ గ్రామంలోనూ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అలాగే రిపబ్లిక్ డే సంబరాల నిర్వహణకూ ఇదే విధంగా నిధులు ఇవ్వనున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఈ నిధులతో పాఠశాలల్లో క్విజ్, డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్ధులకు క్రీడా పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఆగస్టు 15న స్వాతంత్ర సమరయోధుల్ని, రక్షణ రంగంలో పనిచేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికుల్ని పిలిపించి సత్కరించాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+