ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత శాతమంటే ? తేల్చేసిన డిప్యూటీ స్పీకర్-ఎమ్మెల్సీ పోరు వేళ

ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సర్కార్ పై ప్రజావ్యతిరేకత బయటపడుతుందని విపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని విపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి. సంక్షేమం భారీ ఎత్తున అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా క్షేత్రస్దాయిలో పరిస్దితి మరోలా ఉందని చెబుతున్నాయి.అలాగే అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనే దానిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల స్పందించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎంత శాతం ఉందన్నదీ ఆయన వెల్లడించారు. అలాగే ఆ శాతాన్ని మాత్రమే విపక్షాలు పంచుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దుల్ని ఓడించేందుకు విపక్షాలు పలుచోట్ల అవగాహన చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ.. డిప్యూటీ స్పీకర్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత శాతం ఆయన మాటల్లో ఎంతుందో తెలుసా ?

ap deputy speaker kolagatla reveals anti-incumbency percentage on jagan regime

ఏపీలో ప్రజా వ్యతిరేకత కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమేనని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తేల్చిచెప్పేశారు. అంతే కాదు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్ని మాత్రమే విపక్షాలు పంచుకోవాల్సి ఉంటుందన్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారానికి దిగుతున్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపైనా కోలగట్ల విమర్శలు గుప్పించారు. అశోక్ బరిలోకి దిగితే ఈసారి విజయం తథ్యమంటున్నారని, కానీ అశోక్.. గతంలో మున్సిపల్ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేసినా వారు గెలవలేదని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+