AP EAPCET 2022 Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల విడుదల- మీ రిజల్ట్ చెక్ చేసుకోండిలా..
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2022 ఫలితాలు ఇవాళ విడుదలయయ్యాయి. ఎన్డీఆర్ జిల్లా విజయవాడలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో కలిపి మొత్తం 3 లక్షలకు పైగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2.82 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో ఇంజనీరింగ్ లో 89.12 శాతం మంది, వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.
ఏపీ ఈఏపీ సెట్ రాసిన విద్యార్ధులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు పలు వెబ్ సైట్లలో అవకాశం కల్పించారు. ఇందులో ప్రధానంగా https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ లో ఫలితాలను ఉంచారు. AP EAPCET Results 2022 ఫలితాల లింక్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఫలితం తెలుసుకోవచ్చు.

గతంలో ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు ప్రభుత్వం వెయిటేజీ కల్పించేది. కానీ ఈసారి మాత్రం ఇంటర్ మార్కుల వెయిటేజీ లేదు. కాబట్టి ర్యాంకులన్నీ ఈఏపీసెట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉన్నాయి. ఈ ర్యాంకుల ఆధారంగా నేరుగా కౌన్సిలింగ్ కు హాజరై ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications