ఏపి ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులపై వారిపై కేసులు : ద్వివేది
ఆంధ్రప్రదేశ్ లో పోలీంగ్ ఆలస్యం అవడానికి కారణాలను లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈనేపథ్యంలోనే నియోజకవర్గాలో ఈవీఎం నిపుణులను కేటాయించినా వారి సేవలను వినియోగించుకోకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. కాగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు ఈవీఎం ఇంజనీర్లను పంపామని తెలిపారు.కాగా వారు ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి చేరుకున్నారని అన్నారు.
కాగా వీరికి కొన్ని జిల్లాల్లో సరైన రూటు మ్యాప్ ను కూడ ఇవ్వకపోవడం ఆయన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో ఆయన సంబంధిత కలెక్టర్లపై మండిపడ్డారు. కాగా సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ పై వివరణ ఇవ్వాలని ద్వివేది ఆదేశించారు. ఈనేపథ్యంలోనే ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించిన వారిపై కేసులు పెడతామని అన్నారు. శ్రీకాకులం జిల్లా రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.













Click it and Unblock the Notifications