బీజేపీ నేతలకు అస్త్రంగా ఏపీ ఆర్ధిక వ్యవస్థలో లోపాలు .. బుగ్గనకు బీజేపీ నేత లంకా దినకర్ సూటి ప్రశ్నలు !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సమరానికి ఏపీ ప్రతిపక్ష పార్టీలు సై అంటున్నాయి. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ గవర్నర్ కు లేఖ రాయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థలో లోపాలను టార్గెట్ చేస్తూ ఏపీ బీజేపీ నేతలు సైతం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాల కోసం చేసే అప్పులతో భవిష్యత్తుకు తిప్పలు
తాజాగా బిజెపి నేత లంకా దినకర్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిబంధనల మేరకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామని చెబుతున్న రాజేంద్రనాథ్ ఆర్థిక మంత్రా లేక అప్పుల అన్వేషణా మంత్రా అంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాల కోసం చేసే అప్పులతో భవిష్యత్తుకు తిప్పలు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రంగా ఉందని రాబోయే కాలంలో మరింత తీవ్రంగా, భయంకరంగా మారే ప్రమాదం కూడా ఉందని లంకా దినకర్ అభిప్రాయపడ్డారు.

బుగ్గనకు సూటి ప్రశ్నలు సంధించిన లంకా దినకర్
ఇదే సమయంలో ఈ క్రింది ప్రశ్నలకు బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు లంకా దినకర్.
మిగతా రాష్ట్రాలు కూడా ఆదాయ వనరులను పెంచే ఆస్తుల కల్పన మరచి అప్పులతో పప్పుబెల్లాలు పంచుతున్నాయా ? ఇంత బడ్జెట్ ఉన్నా ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ఇన్ని ఆపసోపాలు పడుతున్నాయా? రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ అదః పాతాళంలోకి దింపారు ఇంకా దిగజారకుండా ప్రణాళికలు ఉన్నాయా? ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ పైన మీకు అస్సలు అవగాహన ఉందా ? అంటూ లంకా దినకర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
Recommended Video

ఏపీఆర్ధిక వ్యవస్థలో లోపాలు ఇప్పుడు హాట్ టాపిక్
గతంలోనూ లంకా దినకర్ అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై, బడ్జెట్ పై బుగ్గన రాజేంద్రనాథ్ పై విరుచుకుపడ్డారు. గత మే నెలలో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో బడ్జెట్ లో పస కన్నా బుగ్గన నస ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇప్పుడు తాజా పరిణామాలతో మరోమారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ను లంకా దినకర్ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో లోపాలను టార్గెట్ చేస్తూ టిడిపి నేతలు పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై బిజెపి నేతలు సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications