మార్చిలోనే పదో తరగతి పరీక్షలు- సంక్రాంతికి సిలబస్ పూర్తికావాలి- ఏపీ విద్యామంత్రి సురేష్
ఏపీలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన పరీక్షలపై సందిగ్ధత మొదలైంది. ముఖ్యంగా ప్రతీ ఏడాది తరహాలోనే పదో తరగతి పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ఓ ప్రకటన చేశారు.
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి లో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆ మేరకు సంక్రాంత్రి నాటికి సిలబస్ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 15 నుండి18 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రతి స్కూల్లో 95% వ్యాషినేషన్ పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మఒడి మూడో విడత ఇస్తామని కూడా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరంలో నిబంధనలు పాటించని 375 బీఈడీ, డీఈడీ కాలేజీ లు మూతపడ్డాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Recommended Video
మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని విద్యామంత్రి సురేష్ తెలిపారు. కుప్పంలో ఓడిపోవడం మీ పనితీరుకు నిదర్శనం అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల్లో చట్టసవరణ ద్వారా 35%ఫ్రీ సీట్లు ఇప్పించామని సురేష్ గుర్తుచేశారు. తెలుగుదేశం నాయకులకు అభివృద్ధి కనబడడం లేదని, గ్రామ సచివాలయాలు, నాడు నేడు అభివృద్ధి పనులు కావా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ విద్యార్ధి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫామ్,బుక్స్,తో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తూన్నామన్నారు. కార్పొరేట్ పాఠశాల కు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్తూ తెలుగు కూడా బోధిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications