పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ ప్రజల మద్దతు కోసం నానా పాట్లు పడుతున్నాయి. ఇక నామినేషన్లు దాఖలు చేస్తున్న నేతల ఆస్తుల, అప్పుల చిట్టాపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. అంతేకాదు కేసులపైన కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
చంద్రబాబుపై కేసుల వివరాలివే
ఇక కుప్పం నియోజకవర్గం నుండి ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మొత్తం 22 కేసులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాటిలో మంగళగిరిలోని సిఐడీ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులే 8 ఉన్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్ళ కాలంలో చంద్రబాబుపై అనేక కేసులు నమోదు అయ్యాయి.

ఏపీలోనే కాక మహారాష్ట్రలోనూ చంద్రబాబుపై కేసులు
కొన్ని కేసులు ఆయన ప్రమేయం లేదని మూసేసినప్పటికీ ఎన్నికల అఫిడవిట్ లో ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు ఆ కేసుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబుపై అన్నమయ్య జిల్లాలోనూ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోనూ, రెండేసి చొప్పున అంతపురం, గుంటూరు, కర్నూలు, పల్నాడు, తిరుపతి, విజయనగరం, కృష్ణ, విశాఖ, నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో కూడా ఒక్కొక్క కేసు చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
పవన్ కళ్యాణ్ కేసుల డేటా ఇదే
తాజాగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ లో ఆస్తులు, అప్పుల లెక్కలే కాదు ఆయనపై ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను కూడా వెల్లడించారు. తనపై ఇప్పటివరకు 8 కేసులు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణాలలో ఆయనపై కేసులు
తెలంగాణలో తొర్రూరు, బంజారా హిల్స్ పీఎస్ లలో రెండు క్రిమినల్ కేసులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు, కృష్ణ లంక, తాడేపల్లి పోలీస్ స్టేషన్ లలో మూడు క్రిమినల్ కేసులు, అలాగే వాలంటీర్ లపై వ్యాఖ్యల నేపధ్యంలో మూడు ప్రైవేట్ కేసులు పవన్ కళ్యాణ్ పై ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా 8 కేసులు పవన్ కళ్యాణ్ పై ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు.












Click it and Unblock the Notifications