బాబుకు చెప్పండి: పురంధేశ్వరికి ఏపీ ఉద్యోగుల మొర, ఏపీకి వెళ్లనని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇంకా రూపుదిద్దుకోని అమరావతికి వెళ్లవడం తమకు ఇష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగులను భయాందోళనకు గురిచేసి బలవంతంగా కొత్త రాజధానికి తీసుకెళ్లడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు భారతీయ జనతా పార్టీ నేత, మాజీ మంత్రి పురంధేశ్వరిని కలిసి తమ సమస్యను మొరపెట్టుకున్నారు.
'మిత్రపక్షమైన మీరైనా.. రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్య వివరించండి' అని ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి విన్నవించారు. ఉద్యోగుల తరలింపును ఒక్క ఏడాదైనా తరలింపును ఆపించండని విజ్ఞప్తి చేశారు.

అమరావతిలో కనీస సదుపాయాల్లేవని, మరో ఏడాది పాటు హైదరాబాద్‌లోనే తమను ఉంచాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో గరువారం పురందేశ్వరిని కోరారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనంలో కాకుండా శాశ్వత సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత తరలి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదని వివరించారు. తమ పిల్లలు హైదరాబాద్‌లో జన్మించడంతో స్థానికత సమస్య ఉందని, పరిష్కరించేందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పురందేశ్వరిని ఉద్యోగులు కోరారు.

ప్రభుత్వంతో సంప్రదించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. పురందేశ్వరిని కలిసిన వారిలో ఏపీఎన్జీవో హైదరాబాద్ నగర మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎర్రమంజిల్ కార్యాలయ ఇంజనీర్లు గోపాలక్రిష్ణ, మంజుల, లక్ష్మీ కౌసల్య, ఏపీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, బీజేపీ నాయకుడు సుధీష్ రాంబొట్ల ఉన్నారు.












Click it and Unblock the Notifications