వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌తో మాజీ మంత్రి నారాయ‌ణ‌కు సంబంధాలు??

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్‌రోడ్డులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఏప్రిల్ 27వ తేదీన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు మే 9వ తేదీన సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకు అంగుళం భూమి కూడా సేకరించలేదు. అలాంటప్పుడు అనుచితంగా లబ్ధి ఎలా కలుగుతుందని మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్వీర్యం చేసిన ప్రభుత్వం

ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్వీర్యం చేసిన ప్రభుత్వం


అమరావతి కోసం తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఒక్క అంగుళం భూమి కూడా సేకరించలేదు. సమాజంలో తనకున్న గౌరవ మర్యాదలు, ప్రతిష్ట దిగజార్చాలనే ఉద్దేశంతోనే సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని నారాయణ పేర్కొన్నారు. ఓ హౌసింగ్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థతో తనకు సంబంధాలున్నాయని ఆరోపించారని, తనకుకానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఆ సంస్థతో ఎలాంటి లావాదేవీలు లేవని, కేవలం అనుమానం, ఊహాజనిత కారణాలతోనే సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని స్పష్టమవుతోందన్నారు.

 6 సంవత్సరాల 8 నెలల తర్వాత ఫిర్యాలు చేశారు..

6 సంవత్సరాల 8 నెలల తర్వాత ఫిర్యాలు చేశారు..


ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల సమయం తర్వాత ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. పిర్యాదు ఆలస్యమవడానికి కారణం ఏమిటో చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు. సీఆర్డీఏ చట్టం నిబంధన మేరకే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 420 కింద తనపై కేసు నమోదు చెల్లుబాటు కాదని ఆ పిటిషన్లో నారాయణ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితలుగా ఉన్నవారు ఒక్కరినైనామోసగించడానికి ప్రయత్నించారని ఫిర్యాదుదారుడుు పేర్కొనలేదనే విషయాన్ని గమనించాలన్నారు. కేవలం తనను అపఖ్యాతి పాల్జేయాలనే దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని నారాయణ వివరించారు.

 బెయిల్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా

బెయిల్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా


ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం పారిశ్రామికవేత్తలు లింగమనేని రమేష్, రామకృష్ణ హౌసింగ్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తీర్పు ఈరోజు వెలువడనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి పేరు కూడా ఈ కేసులో చేర్చారు.

English summary
ap ex. minister narayan has links with a housing private limited company?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X