చేతులు లేకున్నా ఎమ్మెల్యే సీతక్క బొమ్మగీసిన ఏపీ బాలిక.. భావోద్వేగానికి గురైన సీతక్క!!

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ పేరు తెలియని వారుండరు. గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో మారుమూల గిరిజన గ్రామాలకు ఏపీ, తెలంగాణ అన్న తేడా లేకుండా వంద కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఎంతోమందికి నిత్యావసరాలు అందించి బాసటగా నిలిచారు. ప్రజా ప్రతినిధి అనే పదానికి నిజమైన అర్థం చెప్పారు. ఇక ఇప్పుడు తాజాగా కురిసిన వర్షాలు, వరదలతో ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ ముంపు బాధితులకు నేనున్నానంటూ అండగా నిలబడుతున్నారు. ప్రజల కోసం పని చేసే నాయకురాలిగా సీతక్క ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

సీతక్కపై బాలిక అభిమానం

సీతక్కపై బాలిక అభిమానం


సాధారణంగా ప్రజాప్రతినిధులపై ఎవరైనా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. చాలావరకు అభిమానాన్ని చూపించేవారు, భవిష్యత్తులో వారి స్వప్రయోజనాల కోసమో, లేదా రాజకీయంగా వారి ఎదుగుదల కోసం చూపించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ నిజమైన అభిమానానికి కొలమానం లేదని, ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా, సీతక్క పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించింది ఓ బాలిక.

 అసామాన్యమైన సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే సీతక్క బొమ్మ గీసిన బాలిక

అసామాన్యమైన సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే సీతక్క బొమ్మ గీసిన బాలిక


ఆపదలో ఉన్నవారికి భరోసా ఇస్తూ, సామాన్యుల్లో సామాన్యురాలిలాగా కనిపిస్తూ అసామాన్యమైన సేవలందిస్తున్న సీతక్కకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. హద్దులు దాటిన అభిమానం ఆమెపై చూపిస్తున్న వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నారు. ఆమెపై నిజమైన అభిమానానికి మచ్చు తునకగా తాజాగా స్వప్నిక అన్న బాలిక సీతక్క బొమ్మ గీసిన సందర్భం నిలిచింది.

చేతులు లేకున్నా సీతక్క బొమ్మ నోటితో గీసిన ఏపీ బాలిక

చేతులు లేకున్నా సీతక్క బొమ్మ నోటితో గీసిన ఏపీ బాలిక


ఇక తనకు చేతులు లేకున్నా, శారీరక వైకల్యం ఇబ్బంది పెడుతున్నా సరే సీతక్క బొమ్మ గీసి సీతక్క పై తన అభిమానాన్ని ప్రదర్శించింది ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వప్నిక అనే బాలిక. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న స్వప్నిక, తన నోటితో పెన్ను పట్టుకుని సీతక్క బొమ్మ గీసింది. చేతులు లేకున్నా సీతక్క బొమ్మ గీసి తన అభిమానాన్ని చాటుకుంది.

ప్రేమ చూపిస్తున్న నిన్ను చూసి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నా


ఇక తన బొమ్మ గీసిన స్వప్నిక అభిమానానికి ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. విద్యుత్ ప్రమాదంలో నీ రెండు చేతులూ కోల్పోయినా నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్న నిన్ను చూసి ప్రజాసేవలో ముందు మరింత ముందుకు సాగాలని పిస్తుంది అంటూ పేర్కొన్నారు. మేము చేస్తున్న కష్టాన్ని ఓర్వలేక మాపై విషపూరిత మనసుతో విషయం చెబుతున్నా మూర్ఖుడు చూసి భయపడి వెనక్కి తగ్గాలా ? అని ఆలోచించే సమయంలో, నీలాంటి వారు నన్ను ప్రేమతో ప్రజాసేవలో ముందుకు నడిపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో స్పందించారు. నోటితో తన బొమ్మ గీసిన స్వప్నిక అభిమానానికి థాంక్స్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+