భవన నిర్మాణాల అనుమతుల్లో మార్పులు - ఇక నుంచి..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో మార్పులు చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే అనుమతులు వచ్చేలా కొత్తగా సింగిల్ విండో విధానం తీసుకొస్తోంది. దరఖాస్తుదారుల స్వీయ ధ్రువీకరణపై 15 మీటర్ల ఎత్తు వరకు భవనాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఎన్ఓసీలు త్వరగా వచ్చేలా ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
సులభతరం
భవన నిర్మాణాల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణం చొప్పున అపార్ట్‌మెంట్లలో సెల్లార్ ఏర్పాటుకు అనుమతి లభించనుంది. అదే విధంగా 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్‌బ్యాక్ 20 మీటర్లకు కుదిం చేలా నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఇప్పటివరకు ప్రతి పది మీటర్ల ఎత్తుకూ సెట్ బ్యాక్ పెంచతున్నారు. ఈ సమస్యకు సర్కార్ పరిష్కారం చూపుతూ తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిది. అభ్యంతరాలు పరిశీలించి జనవరి మొదటి వారంలో అధికారికంగా జీఓ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనుమతుల్లో మార్పు
ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న లే అవుట్ల నియంత్రణకు వాటిలో అంతర్గత రహదారులు 30 అడుగుల వెడల్పుతో వేస్తే సరిపోయేలా నిబంధనల మార్పుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకొస్తోంది. 40 అడుగుల్లో రోడ్లు ఉండాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన మార్పు చేసి రోడ్ల విస్తీర్ణాన్ని 30 అడుగులకు కుదించాలని నిర్ణయించింది. అదే విధం గా బహుళ అంతస్థుల నిర్మాణాలకు ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, అగ్నిమాపక శాఖ నుంచి తొలుత ఎన్‌ఓసీ తీసుకున్నాకే డీపీఎంఎస్ పోర్టల్‌లో అర్జీలు చేస్తున్నారు. సింగిల్‌విండో విధానంలో అనుమతులకు దరఖాస్తు అప్‌లోడ్ చేసి ఫీజులు చెల్లిస్తే సరపోయేలా కొత్త నిర్ణయం తీసుకున్నారు.
అక్రమాలపై చర్యలు
దీంతో, ఇక దరఖాస్తు ఇతర ప్రభుత్వశాఖలకు వెళ్తుంది. అధికారులు పరిశీలించి ఎన్‌ఓసీలు జారీచేసేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖల నుంచి కూడా ఆన్‌లైన్‌లోనే ఇతర అనుమతులు వస్తాయి. అదే విధంగా ఎవరనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ స్థలంలో, తప్పుడు దస్తావేజులు సృష్టించి వేరొకరి స్థలంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.












Click it and Unblock the Notifications