స్కూళ్లకు సంక్రాంతి సెలవుల కుదింపు..!!

విద్యార్ధులు, పేరెంట్స్ కు బిగ్ అలర్ట్. ఏపీలో సంక్రాంతి సెలవులు కుదించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొంత కాలంగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో పెద్ద మొత్తంలో సెలవులు ఇవ్వా ల్సి వచ్చింది. దీంతో, సిలబస్ ను నిర్ణీత లక్ష్యం లోగా పూర్తి చేయటానికి ఇబ్బంది అవుతుందని తాజాగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో, సంక్రాంతి సెలవుల కుదింపు పైన ప్రతిపాదన ల పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఏపీలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు కుదింపు చేయాలనే ఆలోచన పైన కసరత్తు కొనసా గుతోంది. ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం సంక్రాంతి సెలవులు 2025 జనవరి 10 నంచి 19వ తేదీ వరకు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ సెలవుల్లో కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంది నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఏపీలో పలు జిల్లాల్లో వరుసగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో, ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

AP Gove chances to reduce Pongal holidays for Schools as latest proposals from officials

ఈ సెలవుల కారణంగా సిలబస్ బోధన పూర్తి కాలేదని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికే పరీక్షల క్యాలెండర్ ఖరారు చేయటంతో... సిలబస్ పూర్తి చేసేందుకు సంక్రాంతి సెలవు లను పరిమితం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో, సంక్రాంతి సెలవులను అయిదు రోజులే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగగా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంత గ్రామాలకు వస్తారు.

ఇక, పేరెంట్స్ తమ పిల్లల సెలవుల కు అనుగుణంగా ప్రయాణాలకు సిద్దమయ్యారు. రిజర్వేషన్లు చేసుకున్నారు. ఇప్పుడు సెలవుల మార్పుతో పేరెంట్స్ కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ప్రభుత్వం అందిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతుందా, లేక ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీని పైన ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+