వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల యూటర్న్-చర్చిస్తే పాత జీతాలు-ఇక నో ఛాన్స్-సజ్జల చిట్ చాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఏపీలో ఉధ్యోగులు చేస్తున్న పోరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల పోరు కారణంగా జీతాల ప్రాసెసింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీడియా చిట్ చాట్ లో సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి.

జీతాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

జీతాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సాగిస్తున్న పోరుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మరోసారి స్పందించారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు , ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదన్నారు.

చర్చిస్తే పాత జీతాలొచ్చేవి

చర్చిస్తే పాత జీతాలొచ్చేవి


ఉద్యోగులు ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై సజ్జల స్పందించారు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీ తో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించి ఉండేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. తద్వారా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం వల్ల ఈ నెలవరకూ పాత జీతాలు తీసుకునే అవకాశం కూడా కోల్పోయారనే అర్ధం వచ్చేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయి.

కొత్త జీతాలివ్వకుండా అడ్డుకుంటున్నారన్న సజ్జల

కొత్త జీతాలివ్వకుండా అడ్డుకుంటున్నారన్న సజ్జల

కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులను రూపోందిస్తున్న డీడీఓలను పనిచేసుకోనివ్వకుండా ఉద్యోగులు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు భావిస్తే దానిపై చర్చించడానికి మంత్రుల కమిటీ సిద్ధమేనని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువే ఉద్యోగుల బాగోగుల గురించి ప్రభుత్వం ఆలోచించిందని ఆయన తెలిపారు.

ఉద్యోగుల యూటర్న్

ఉద్యోగుల యూటర్న్

పదే పదే చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరి, పిలిచి మాట్లాడామని సజ్జల గుర్తుచేశారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఒకటీ రెండు అంశాలపైనే దృష్టి పెట్టాలని ఉద్యోగ సంఘాలకు ముందే చెప్పామన్నారు. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయని సజ్జల తెలిపారు. ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించటం సరికాదన్నారు. తద్వారా ఫిట్ మెంట్ పై గతంలో అంగీకరించి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఉద్యోగసంఘాల నేతల్ని ఉద్దేశించి సజ్జల వ్యాఖ్యానించారు.

English summary
ap government advisor sajjala ramakrishna reddy on today made key comments on employees fight over prc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X