ఏసీబీ కాల్స్ వస్తున్నాయా..? ఏపీ ఉద్యోగులకు సర్కార్ క్లారిటీ..!
ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. పలు చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్ గా అవినీతి చేపల్ని, తిమింగలాల్ని పట్టుకుంటోంది. అదే సమయంలో ఉద్యోగులకు నేరుగా ఏసీబీ నుంచి కాల్స్ వస్తున్నాయి.
ఏసీబీ అధికారుల పేరుతో రాష్ట్రంలో పలువురు ఉద్యోగులకు కాల్స్ రావడం, మీరు అవినీతి చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి, డబ్బులివ్వకపోతే మీపై రైడ్స్ చేసి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పలు చోట్ల ఇలా కాల్స్ రాగానే అధికారులు బెంబేలెత్తిపోయి వారికి డబ్బులు సమర్పించుకున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఇవాళ స్పందించింది.

ఉద్యోగులకు తమ అధికారుల నుంచి కాల్స్ చేస్తున్నట్లు, డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ నేరుగా స్పందించింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారులకు ఫోన్ చేసి, తాము ఏసీబీ అధికారులుగా నటిస్తూ, ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, తమపై అనేక ఫిర్యాదులు వచ్చాయని బెదిరిస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది. ఏసీబీ దాడి జరుగుతుందని, దాడిని ఆపడానికి, డబ్బు డిమాండ్ చేస్తున్నారని, దానిని ఒక నిర్దిష్ట మొబైల్ నంబర్‌కు పంపాలని లేదా దానిని తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి నగదుగా ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలిపింది.

మరికొన్ని సందర్భాల్లో, ఈ వ్యక్తులు తమపై ఏసీబీ కేసు నమోదు అయిందని, అరెస్టును నివారించడానికి, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొంది. అవినీతి నిరోధక బ్యూరోలోని ఏ అధికారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫోన్ కాల్స్ చేయరని లేదా డబ్బు డిమాండ్ చేయరని ఏసీబీ ప్రధాన కార్యాలయం తెలిపింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు లేదా మోసపూరిత కాల్స్ వస్తే, వారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఏసీబీ టోల్-ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications