వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఈ నెల 8 నుంచి హోటల్స్, రెస్టారెంట్లు- ముందుగా ఆ నాలుగు నగరాల్లో..

|
Google Oneindia TeluguNews

ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులతో రెండున్నర నెలలుగా మూతపడిన హోటల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో హోటల్స్ తో పాటు రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ ప్రకటించారు. సోమవారం నుంచి హోటల్ రూమ్స్ ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అలాగే వరుస ప్రమాదాలతో నిలిచిపోయిన బోటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Recommended Video

Lockdown : AP Ready To Unlock Restaurants & Hotels In These 4 Districts From June 8

 జగన్ ఇంటి సమీపంలో నాలుగు కరోనా కేసులు- ఇద్దరు వాలంటీర్లు సహా.... హై అలర్ట్ జగన్ ఇంటి సమీపంలో నాలుగు కరోనా కేసులు- ఇద్దరు వాలంటీర్లు సహా.... హై అలర్ట్

హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతి...

హోటల్స్, రెస్టారెంట్లకు అనుమతి...

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెలలో మూతపడిన హోటల్స్ , రెస్టారెంట్లు తిరిగి ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి. రెండున్నర నెలలుగా వ్యాపారం లేక ఉసూరుమంటున్న పర్యాటక, ఆతిధ్య రంగాన్ని గాడిన పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా లాక్ డౌన్ మినహాయింపులతో వీటికి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముందుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ‌కాకినాడ పట్టణాల్లో హోటల్స్, రెస్టారెంట్లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అన్ని ప్రైవేటు హోటల్స్, రెస్టారెంట్లతో పాటు ప్రభుత్వ టూరిజం విభాగం ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్లు కూడా ప్రారంభం కానున్నాయి.

నదుల్లో బోటింగ్ కూడా ప్రారంభం....

నదుల్లో బోటింగ్ కూడా ప్రారంభం....


రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ తో నదుల్లో నిలిచిపోయిన పర్యాటకశాఖ బోట్లను కూడా తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వారం రోజుల్లో సీఎం జగన్ నదుల్లో బోటు ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్స్ ప్రారంభిస్తారు. ఆ వెంటనే గోదావరి, కృష్ణా నదుల్లో బోటింగ్ ప్రారంభమవుతుంది. గతంలో జరిగిన బోటు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, ప్రభుత్వ అనుమతితోనే బోట్లు నడిచేలా ఏర్పాటు చేస్తున్నారు.

టూరిస్టుల భద్రతకు ప్రాధాన్యం...

టూరిస్టుల భద్రతకు ప్రాధాన్యం...


కరోనా ప్రభావం తగ్గాక అరకు, మారేడుమిల్లితో పాటు మిగిలిన పర్యాటక ప్రాంతాల్లోనూ ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అలాగే టూరిస్టుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అన్ని కరోనా నియంత్రణ చర్యలను తీసుకుంటామన్నారు. అలాగే ఏపీకి వచ్చే పర్యాటకులు కూడా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ టూరిజం మ్యాప్లో ఏపీని ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అవంతి వెల్లడించారు

English summary
andhra pradesh government has allowed to re open hotels and restaurants in the state from 8th june. as a part of lockdown relaxations govt has decided to re open them to encourage tourism and hospitality sectors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X