ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు అప్పుడే..! సర్కార్ కీలక ప్రకటన..!
ఏపీలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ విజయానంద్.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. దీంతో అధికారులు నిధుల విడుదలకు సిద్దమవుతున్నారు.
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్. రైతులకు ఆర్దికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల వంతున అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ పధకానికి సంబంధించి ఇంకా ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని వారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రందించి ఇ-కెవైసి , మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సీఎస్ సూచించారు. ఈ పధకం అమలుకు ఇంకా మరో మూడు రోజులు వరకూ సమయం ఉన్నందున ఈరెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కోరారు.

అలాగే ఇ-కెవైసీ,ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజిఎస్ ద్వారా ఆయా రైతులందరికీ మెసేజ్ పంపాలని అధికారుల్ని ఆదేశించారు. అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ పధకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయశాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. అలాగే తిరస్కరించబడిన వారి వివరాలను రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు 1వ తేదీలోగా మరోసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని ఆదేశించారు.

కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోడవం, చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈపధకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని, వాటిపై రెవెన్యూశాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై గురువారం కలెక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చిస్తామన్నారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు











Click it and Unblock the Notifications