ఏపీలో మొంథా తుఫాన్ బాధిత చేనేతలకు గుడ్ న్యూస్..!
ఏపీలో మొంథా తుపాన్ కారణంగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఇవాళ శుభవార్త అందించింది. తుపాను కారణంగా నష్టపోయిన మత్సకారులతో సమానంగా చేనేతలకు కూడా సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. చేనేతలకు ప్రభుత్వం ప్రత్యేక సాయంలో భాగంగా ఏమేం ఇస్తారో ఆమె వెల్లడించారు.
మొంథా తుఫాన్ తో నష్టపోయిన చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి సవిత తెలిపారు. నీటి మునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామన్నారు. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార కేజీ చొప్పున్న నిత్యావసరాలు అందజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మత్స్యకారులకు, చేనేతలకు మాత్రమే 50 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల మొంథా తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిందని, దీని వల్ల రైతులతో పాటు చేనేత కార్మిక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వర్షాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 27,982 చేనేత కుటుంబాలను తుఫాన్ బాధిత కుటుంబాలుగా అధికారులు గుర్తించారన్నారు. తీవ్ర వర్షాల కారణంగా నీట మునిగి మూడు మగ్గాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. 718 మందికి చెందిన నూలు, రంగులు, రసాయనాలు వంటి ఇతర వస్తువులు నీటిలో తడిచిపోయాయన్నారు.

ఇందులో తడిచిపోయిన నూలు, ఇతర రంగులకు రూ.5 వేలు చొప్పున రూ.35.90 లక్షలు అందజేస్తున్నామన్నారు. నీటి మునిగిన మూడు మగ్గాలు స్వల్పం నష్టం చేకూరిందని తెలిపారు. ఆ మగ్గాలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు బాధితులకు రూ.10 వేలు అందజేస్తున్నామన్నారు. వాటితో పాటు నిత్యాసరాలు అందజేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లాలో అత్యధికంగా 8,567 మంది చేనేత కుటుంబాలకు తుఫాన్ కారణంగా నష్టపోయాయన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,278 కుటుంబాలు, కృష్ణాలో 3,900 కుటుంబాలు, శ్రీకాకుళంలో 3,333 కుటుంబాలు, నెల్లూరులో 2,400 కుటుంబాలు, తిరుపతి జిల్లాలో 1700 కుటుంబాలు మొంథా బాధిత కుటుంబాలు గుర్తించామన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ బాధిత కుటుంబాలను గుర్తించి నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications