తెలంగాణ ఐఏఎస్ అధికారికి ఏపీలో తొలి పోస్టింగ్-ఎక్కడో తెలుసా ?

గతంలో ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణకు వెళ్లిపోయారు. పాలనా పరమైన కారణాలతో ఇన్నాళ్లూ తెలంగాణలో ఉండిపోయిన ఆ నలుగురు ఐఏఎస్ లను తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఏపీకి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. దీన్ని వారు క్యాట్ తో పాటు తెలంగాణ హైకోర్టులోనూ సవాల్ చేసినా ఊరట దక్కలేదు. దీంతో నలుగురు ఐఏఎస్ లు కాటా అమ్రపాలి, ప్రశాంతి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణలు ఏపీలో రిపోర్ట్ చేశారు.

అయితే ఇలా ఏపీలో రిపోర్ట్ చేసిన ఈ నలుగురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇవాళ అందులో ఒకరైన ఎం ప్రశాంతికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెను అటవీ, పర్యావరణశాఖలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ap government begins giving postings to ias officers transferred from telangana

మరోవైపు మిగిలిన ముగ్గురు ఐఏఎస్ లకు ఏపీ ప్రభుత్వం ఎక్కడ పోస్టింగ్ లు ఇవ్వబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇందులో కాటా ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ లను తెలంగాణ ప్రభుత్వం డిప్యూటేషన్ మీద వెనక్కి రప్పించనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో తెలంగాణ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం రేపు, ఎల్లుండిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+