ఏపీ ప్రభుత్వం షాకింగ్ డిసిషన్.. అక్కడే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు !
ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈసారి రాజధానిలో నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అమరావతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే రాజధాని కేంద్రంగా పరిపాలనలో తొలి అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో అమరావతిని పరిపూర్ణ రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి ఇదే నిదర్శనం అని చెబుతున్నారు.

ఎక్కడంటే..?
ఈసారి ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అమరావతిలోని ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇది రాజధాని పునర్నిర్మాణ సంకేతంగా మారనుంది.
కాగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్.. ఆ తర్వాత 2019 లో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగానే ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ వచ్చాయి. కానీ ఈసారి ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడమే కాకుండా, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల పనులు మళ్లీ శరవేగంగా సాగుతున్నాయి. ఈ వేడుకల ద్వారా అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications