ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకుంటున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఉద్యోగుల ఓటు హక్కును తిరస్కరించవద్దని ఆర్వోలను ఆయన ఆదేశించారు. ఉద్యోగులకు సాధారణ సెలవు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆదేశాలను ఆర్వోలకు, జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు.
ఈ నెల 7, 8 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఫారం-12 స్వీకరించి అర్ఝహులైనవారందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈనెల ఒకటో తేదీ లోపు ఫారం-12 సమర్పించనివారికి ఓటురుగా నమోదైన నియోజకవర్గంలోనే ఫారమ్ -12 సమర్పించేందుకు, ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వినియోగానికి అవకాశం ఇవ్వాలని సీఈవో ఆదేశించారు. ఆర్వోలు రెండురోజులు ఫెసిలిటేషన్ సెంటర్లలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఉద్యోగులకు ఎటువంటి సందేహాలున్నా వాటిని ఆర్వోలు తీర్చాలని, ఓటుహక్కును వినియోగించుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.450 కోట్ల నగదు, మద్యం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మీనా తెలిపారు. సున్నితమైన, అతి సున్నితమైన వాటిగా 12,400 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అందుకు తగ్గట్లుగా అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులు కొందరు ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నారని, వారికోసం ప్రత్యేకంగా సాధారణ సెలవు మంజూరు చేయడం జరిగిందని, దాన్ని ఉపయోగించుకొని ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ముకేశ్ కుమార్ మీనా సూచించారు.












Click it and Unblock the Notifications