Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా ఆందోళనతో ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్; మంత్రి విడదల రజిని కీలక ఆదేశాలు!!

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి రేగుతోంది . కరోనా వైరస్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 కలకలం రేపుతున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో కేంద్రం సూచనలతో అప్రమత్తమైన ఏపీ ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాట్లను చేపడుతోంది.

అధికారులను అలెర్ట్ చేసిన మంత్రి విడదల రజిని

అధికారులను అలెర్ట్ చేసిన మంత్రి విడదల రజిని

కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్లు నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను అప్రమత్తం చేశారు. విశాఖ జివిఎంసి కార్యాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అత్యవసర సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గతంలో మాదిరిగా కరోనా మహమ్మారి పై ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని విడదల రజిని పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి, బిఎఫ్ 7 తీవ్రత ఏ విధంగా ఉన్నా ఎదుర్కోవడానికి ముందస్తు సమాచారాన్ని సేకరించాలని మంత్రి విడదల రజిని సూచించారు.

ప్రతీ హెల్త్ సెంటర్ లో రాపిడ్ టెస్టులు.. ప్రజలకు ఆందోళన వద్దు

ప్రతీ హెల్త్ సెంటర్ లో రాపిడ్ టెస్టులు.. ప్రజలకు ఆందోళన వద్దు


రాష్ట్రంలోని ప్రతి హెల్త్ సెంటర్ లో రాపిడ్ టెస్టులు నిర్వహించేలా కిట్స్ సిద్ధం చేయాలని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించమని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి విడదల రజిని ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని , ఓమిక్రాన్ బి ఎఫ్ 7 నియంత్రణ కోసం సన్నద్థంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ పైన కూడా దృష్టి సారించాలని పేర్కొన్న మంత్రి విడదల రజిని వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు.

వ్యాక్సిన్లు చేయించుకోండి: మంత్రి విడదల రజిని

వ్యాక్సిన్లు చేయించుకోండి: మంత్రి విడదల రజిని


60 ఏళ్ల పైబడిన వాళ్ళంతా ముందస్తు వ్యాక్సిన్లు చేయించుకోవాలని సూచించారు. బూస్టర్ డోసు తీసుకోని వారు బూస్టర్ డోసులు తీసుకోవాలన్నారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ మీద ఎక్కువగా దృష్టి సారించామని, జీనోమ్ సీక్వెన్స్ టెస్ట్ చేయడం కోసం విజయవాడలో ల్యాబ్ అందుబాటులో ఉంటుందని, ప్రతి జిల్లాలోనూ అన్ని ల్యాబ్లు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని విడదల రజిని పేర్కొన్నారు. ఇక ఆస్పత్రిలోనూ కరోనా రోగులకు కావల్సిన అన్ని వసతులను కూడా సిద్ధం చేస్తున్నామని, ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు.

విజయవాడలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్ : వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ నివాస్

విజయవాడలో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్ : వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ నివాస్

ఇక ఇదే సమయంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో అంతర్జాతీయ వాక్సినేషన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్న ఆయన కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుమతులతో సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు .అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తో ఈ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్న ఆయన అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వ్యాక్సిన్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతామన్నారు.

అవసరాలకు తగ్గట్టు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి

అవసరాలకు తగ్గట్టు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి

ప్రస్తుతం మనదేశంలో ఎల్లో ఫీవర్ లేకున్నా, సెంట్రల్ ఆఫ్రికా దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చే పర్యాటకుల వల్ల ఈ ప్రమాదకరమైన వ్యాధి మన దేశంలోకి వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ తెలిపారు. అంతర్జాతీయ వ్యాక్సినేషన్ సెంటర్లో అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+