ట్రైనీ కానిస్టేబుళ్లకు కూటమి సర్కారు గుడ్ న్యూస్.. స్టైఫండ్ భారీగా పెంపు !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితతో కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ప్రజా భద్రతకే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తోందని.. పోలీసుల గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా విధుల్లో చేరినవారు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

స్టైఫండ్ పెంపు..

కాగా ఈ మేరకు సభా వేదికగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎం స్టేజీపై ప్రసంగిస్తూ ఉండగా స్టైఫండ్ గురించి నినాదాలు వినిపించాయి. వెంటనే ఆ విషయాన్ని మంత్రి అనిత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆయన శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్ గురించి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించి ప్రస్తుతం రూ.4,500గా ఉన్న స్టైఫండ్ ను రూ.12,500 కు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ap-government-increase-trainee-constables-stipend-from-4500-to-12500

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ....గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించి , యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఈ వ్యవహరంలో తమపై 31 కేసులు వేశారని కానీ కేసులు పరిష్కరించి నియామక పత్రాలను అందించామని స్పష్టం చేశారు. 6100 మంది రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో 6014 మంది సెలక్ట్ అయ్యారని.. ఇందులో 5757 మంది ట్రైనింగ్ కు ఎంపిక అయ్యారని వెల్లడించారు.

ఇక అందులో సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారని వివరించారు. సివిల్ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారని.. మగవారికి ఏ విషయంలోనూ మహిళలు తీసి పోకూడదనే ఉద్దేశంతో గతంలోనే ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 183 మంది ఆదివాసీ అభ్యర్ధులు ఎంపిక కావడం గర్వంగా ఉందని అన్నారు.

మరోవైపు గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రికార్డ్ టైమ్‌లోనే పరీక్షలు, రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించి 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించిందన్నారు. మానవ జోక్యం అనేది లేకుండా అన్ని ఫిజికల్ ఈవెంట్స్‌లో టెక్నాలజీని వినియోగించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+