ఏపీలో ఇసుకపై మరో గుడ్ న్యూస్-ఉత్తర్వులు జారీ..!

ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజాగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఉచిత ఇసుకపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలతో తాజాగా కేబినెట్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటిపై ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇసుక వినియోగదారులకు మరింత ఊరట లభించనుంది.

ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ప్రభుత్వం విధించే సినరేజీ ఫీజు మాఫీ చేయాలని తాజాగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా సీనరేజ్ ఫీజును మాఫీ చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎలాంటి రుసుం చెల్లించకుండా ఇసుకను నిర్మాణ అవసరాలకు తీసుకువెళ్లే అవకాశం కల్పించారు.

ap government issued orders to exempt seigniorage fee for free sand

నిర్మాణ రంగంతో ఉపాధి ఆదాయం పెరుగుతున్నందున ఉచిత ఇసుక విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సినరేజీ ఫీజు, మెరిట్ అన్ శాండ్ , డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్టు ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల స్థానికంగా ఇసుక లభ్యత రవాణా పెరుగుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేలా విజిలెన్స్‌నూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+