ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై ఫుల్ క్లారిటీ..! జీవో విడుదల- ఈ బస్సుల్లో, వీరందరికీ ఛాన్స్..!

ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలుతో కూడిన జీవోను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. దీంతో ఇప్పటివరకూ ఈ పథకంపై నెలకొన్న అపోహలకు చెక్ పెట్టినట్లయింది.

ఇవాళ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని పేర్కొంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయొచ్చని వెల్లడించింది. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని తెలిపింది.

ap government issues guidelines to free bus travel to women scheme- here are full details

ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం అమలు ప్రారంభం అయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్లు తెలిపింది.

నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సుల్లో, ఛార్జర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది. నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ap government issues guidelines to free bus travel to women scheme- here are full details

ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండ్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ పథకంలో అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో టికెట్లు జారీ చేస్తామని తెలిపింది. తద్వారా ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల ప్రయాణాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేస్తుందని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+