22 నుంచి ఏపీ ఆసెంబ్లీ-ఐదు రోజుల సభ ? మళ్లీ ఓటాన్ బడ్జెట్ ?
ఏపీలో కూటమి సర్కార్ రెండోసారి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్దమవుతోంది. ఈ వారం జరిగిన కేబినెట్ భేటీలో 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. దీంతో సోమవారం అసెంబ్లీ సమావేశం కాబోతోంది. అదే రోజు జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశమవుతుంది. తొలిరోజు ఉదయం ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బీఏసీ భేటీ నిర్వహిస్తారు. ఇందులో ఓటాన్ అకౌంట్ తో పాటు ఇతర అజెండా ఖరారు చేస్తరాు. మరోసారి రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తిస్దాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తగినంత సమయం లేకపోవడంతో రెండు నెలలకు ఓటాన్ అకౌంట్ తీసుకునే అవకాశాలున్నాయి.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులతో ఇవాళ భేటీ అయ్యారు. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, అధికారులతో చర్చించారు. అనంతరం స్పీకర్, మండలి ఛైర్మన్ అధికారులతో సమావేశమై అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో ఆంక్షలు తగ్గించేలా పలు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సమావేశాల్లో కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా సూర్యదేవర ప్రసన్నకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications