వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Night Curfew : ఏపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ-సమయాలు, మినహాయింపులివే

|
Google Oneindia TeluguNews

ఏపీలో నానాటికీ పెరుగుతున్న కోవిడ్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట కర్ఫ్యూకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్ధితిపై సమీక్ష సందర్భఁగా నిన్న రాత్రిపూట కర్ఫ్యూకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా వైద్యారోగ్యశాఖ ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా నియంత్రణ కు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీలో రాత్రిపూట కర్ఫూ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయాల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు పనిచేయవు. రాకపోకల్ని కూడా పూర్తిగా నియంత్రిస్తారు. అలాగే రాత్రిపూట కర్ఫ్యూను ప్రాథమికంగా జనవరి 31వరకూ అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

ap government orders for night curfew from today till january 31 in wake of covid surge

రాత్రిపూట కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసి దుకాణాలు,పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలికమ్యూనికేషన్లు, ఐటీ సేవలు,విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మింహాయింపులను ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో మరోసారి ఆదేశాలు ఇచ్చింది. వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే 10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే సినిమా హాళ్లు లో 50 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

English summary
andhrapradesh government imposed night curfew from today in wake of latest covid 19 surge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X