ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ నిధుల విడుదల..!
ఏపీలో రైతులకు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం వేళ శుభవార్త చెప్పింది. వేసవి కాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు పలకరిస్తున్న వేళ ఖరీఫ్ పంటలకు సిద్ధమవుతున్న రైతుల కోసం ఓ కీలక పథకానికి సంబంధించిన నిధుల్ని విడుదల చేసింది. సకాలంలో పంటలు వేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకునే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా రాష్ట్ర వాటా అయిన 50 శాతం సమానమైన మొత్తాన్ని ముందస్తు ప్రీమియంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.132.58 కోట్ల నిధుల్ని ఇలా ఖరీఫ్ సంబంధిత బీమా పథకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి ఈ మొత్తం ఉపయోగపడనుంది.

రాష్ట్రంలో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి ఎంత సాయం అందుతున్నా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి సమయంలో సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ అందేందుకు వీలుగా బీమా పథకాలు పనికొస్తున్నాయి. ఇలా ఈ ఖరీఫ్ సీజన్ లో రైతుల్ని ఆదుకునే బీమా పథకాలకు ముందస్తు ప్రీమియం చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసింది. కేంద్రం వాటాతో కలిపి ఈ ప్రీమియాన్ని బీమా అందించే సంస్థలకు చెల్లిస్తారు.












Click it and Unblock the Notifications