50శాతం పెంచిన తర్వాత కొత్త మద్యం ధరలు ఇవే..! కొత్త రేట్లను విడుదల చేసిన ఏపీ సర్కార్..!
అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో అందరికంటే ఎక్కువగా బాధపడ్దది మందుబాబులే కావడం విశేషం. చుక్క మందు దొరక్క వారు పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఇక కొందరైతే మద్యం దొరక్క మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. కొందరి మానసిక ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్స్‌లో చేరారు.
ఇక మే 4 తర్వాత లాక్‌డౌన్‌ను 17 వరకు పొడిగించిన కేంద్రప్రభుత్వం కొన్ని జోన్లలో షరతులు విధిస్తూ మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పింది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ మద్యం దుకాణాలు ఓపెన్ చేసేందుకు అనుమతిస్తూ మద్యంపై 25శాతం ధరలు కూడా పెంచింది. ఇది తొలిరోజు ఉండగా రెండో రోజు మద్యం ధరలను 50శాతం పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం ఆ తర్వాత క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిల్స్ పై కొత్త ధరలను ప్రకటించింది. మొత్తం మీద 75శాతంకు మద్యం రేట్లు పెరిగాయి.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కొన్ని జోన్లలో ఆంక్షలు సడలింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు కొన్ని జోన్లలో తెరిచేందుకు అనుమతిచ్చింది. అదే సమయంలో నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ షరతులు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వైన్ షాప్ యజమానులపై, ఇటు నిబంధనలు ఉల్లంఘించిన కస్టమర్‌పై కూడా చర్యలు తీసుకుంటుందనే స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చింది.

తాజాగా ఏపీ ప్రభుత్వం మద్యంపై జారీ చేసిన ప్రకటన ఒక్కింత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మద్యం దుకాణాలు తెరుస్తూనే మద్యం రేట్లను 25 శాతం అధికంగా పెంచింది. ఇదంతా తొలిరోజు కహానీ. అయితే రెండో రోజున మరో 50శాతం పెంచుతూ మందుబాబులకు షాకిచ్చింది జగన్ సర్కార్. అంతేకాదు ఏ మందు ఎంతకు అమ్మాలో రేట్లను ఫిక్స్ చేసింది. తప్పదు అనుకున్న మందుబాబులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు.
50 శాతం పెంచిన తర్వాత కొత్త ధరలు
బీరు ధరలు
330ml - పెరిగిన ధర 40రూ.
500/650ml - రూ.60
30000ml - రూ. 4000
50000ml- రూ.6000
రెడీ టూ డ్రింక్ 250/275ml. -రూ.60పెరుగుదల
180ml ధర రూ.120కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు
60/90ml.- రూ.20పెరుగుదల
180 ml - రూ.40పెరుగుదల
375ml - రూ.80.పెరుగుదల
750ml - రూ160.పెరుగుదల
1000ml -రూ.140పెరుగుదల
2000ml - రూ.480పెరుగుదల
180ml ధర రూ. 120 నుంచి రూ. 180 మధ్యలో ఉన్న వాటిపై పెంపు
60/90ml.- రూ.40పెరుగుదల
180 ml - రూ.80పెరుగుదల
375ml - రూ.160పెరుగుదల
750ml - రూ. 320పెరుగుదల
1000ml - రూ.480పెరుగుదల
2000ml - రూ.960పెరుగుదల
రూ.150కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు
60/90ml.-రూ.60పెరుగుదల
180 ml - రూ. 120.పెరుగుదల
375ml - రూ.240 పెరుగుదల
750ml - రూ. 480పెరుగుదల
1000ml - రూ.720పెరుగుదల
2000ml - రూ.1440పెరుగుదల
సోమవారం నాటి ధరలు
సోమవారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.120 కన్నా తక్కువగా ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 చేస్తూ దాన్ని రూ.140 చేసింది. ఇక హాఫ్ బాటిల్స్ పై రూ. 40 పెంచగా.. ఫుల్ బాటిల్స్ పై రెట్టింపుతో రూ.80 పెంచుతూ నిర్ణయించింది. ఇక రూ.120 నుంచి రూ.150 ధర ఉన్న క్వార్టర్ బాటిల్స్ పై రూ. 40 పెంచింది ప్రభుత్వం. ఇక ఈ రేంజ్‌లో ఉన్న బ్రాండ్లు హాఫ్ బాటిల్స్ పై రూ.80 పెంచగా ఫుల్ బాటిల్స్ పై రూ. 120 పెంచింది. క్వార్టర్ రూ.150కి పైగా ధర ఉన్న బ్రాండ్లపై రూ. 60 పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఈ బ్రాండ్స్‌లో హాఫ్ బాటిల్ పై రూ. 120, ఫుల్ బాటిల్స్ పై రూ.240 పెంచుతూ డిసైడ్ అయ్యింది. ఇక మినీ బీర్ పై రూ. 20 పెంచగా ఫుల్ బీర్ పై రూ. 30 పెంచింది.