శేఖర్ రెడ్డిపై 'టిటిడి' వేటు ఖాయమేనీ ట్విస్ట్, బాబు కసరత్తు: హోటల్ రూంలో 1 కిలోల బంగారం

శేఖర్ రెడ్డిపై 'టిటిడి' వేటు ఖాయమేనీ ట్విస్ట్, బాబు కసరత్తు: హోటల్ రూంలో 1 కిలోల బంగారం

అమరావతి/బెంగళూరు: ఐటీ అధికారుల సోదాల్లో భారీ ఎత్తున ఆదాయం, బంగారం పట్టుబడుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి సభ్యుడు, తమిళనాడుకు చెందిన జె శేఖర్ రెడ్డిపై వేటువేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో భారీ ఎత్తున నల్లధనం బయటపడడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఆయన్ను పాలకమండలి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అయితే, శేఖర్ రెడ్డిపై వేటు వేయడం ఖరారు అయినప్పటికీ చట్టపరంగా ఎలాంటి సమస్య లేకుండా ఏ విధంగా తొలగించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున డబ్బు

పెద్ద ఎత్తున డబ్బు

శేఖర్ రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లల్లో రూ.కోట్లల్లో నగదు, కిలోల కొద్దీ బంగారం పడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం వరకు రూ.107 కోట్ల నగదు, 127 కిలోల బంగారాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. శనివారం మరింత స్వాధీనం చేసుకున్నారు.

సోదాలు

సోదాలు

శనివారం కూడా శేఖర్ రెడ్డి స్వగ్రామమైన కాట్పాడి సమీపంలోని తొండాన్‌తులసిలో ఆయనకు చెందిన ఇల్లు, బంధువుల నివాసాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంటివద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారులో రూ.24 కోట్ల నగదు లభ్యమైంది. ఇవన్నీ కొత్త రూ.2 వేల నోట్లు. వాటిని చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు.

పలుచోట్ల మెరుపు దాడులు

పలుచోట్ల మెరుపు దాడులు

మరోవైపు శేఖర్ రెడ్డికి ఇతర ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లో కూడా అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. కాట్పాడి పరిధి గాంధీనగర్‌లోని ఈస్ట్ క్రాస్‌రోడ్‌లో ఉన్న ఆయన భవనానికి గత గురువారం అధికారులు సీల్‌ వేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సోదాలు నిర్వహించాలని భావించడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శేఖర్ రెడ్డి భార్య జయశ్రీని శనివారం సాయంత్రం అధికారులు తీసుకొచ్చారు. ఇంటి సీల్‌ను తొలగించి తనిఖీలు ఆరంభించారు. ఈ ఇంట్లో కూడా రూ.కోట్లల్లో నగదు ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హోటల్లో 12 కిలోల బంగారం

స్టార్ హోటల్లో 12 కిలోల బంగారం

ఇదిలా ఉండగా, చెన్నైలో శేఖర్‌ రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. శేఖర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీనగర్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో శేఖర్ రెడ్డికి చెందిన గదిలో శనివారం 12 కిలోల బంగారం లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+