ఏపీకి మరో తుపాను ముప్పు ? ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు..! వాట్సాప్ లో..!
ఏపీలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను తాజాగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఓవైపు రైతులకు ధాన్యం కొనుగోళ్ల డబ్బులు జమ చేస్తూనే, మరోవైపు వేగంగా ఈ కొనుగోళ్లు పూర్తి చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్రంలో మరో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఇవాళ అధికారుల్ని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం 3 వేల కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ధాన్యంలో 17 శాతం మించి తేమ ఉండకూడదని కేంద్రం నిబంధన పెట్టడంతో ఆ మేరకు ఉంటేనే కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. 73373-59375 నెంబర్ ను ఇందుకు కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకునే రైతులు ఈ నెంబర్ కు Hi అని సందేశం పంపగానే ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు.

రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత పేరు ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మదలచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. అనంతరం ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని, సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే మెసేజ్ లో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారన్నది నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేసిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాదరబందీ లేకుండా అమ్ముకోవచ్చు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
MRO అధికారాలు, నెల జీతం ఎంతో తెలుసా..? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications