జాతీయ స్థాయిలో 3వ స్థానంలో జగన్ - అరుదైన గుర్తింపు..!!
ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమవుతోంది. ఈ సమయంలో జగన్ పాలనకు అరుదైన గుర్తింపు దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక "స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023"లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ..ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగింది. జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఈ గుర్తింపు దక్కటం ప్రాధాన్యత సంతరించుకుంది.
జాతీయ స్థాయిలో: ఏపీలో జగన్ పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సుపరిపాలనలో మూడో స్థానంలో నిలిచింది. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలనా సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లింది.

గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు... ఇంటివద్దకు రేషన్... పెన్షన్ వంటి వాటి అమలు ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల్లో 3వ స్థానం దక్కించుకున్నారు. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది.
పాలనా సంస్కరణలతో: పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక "స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్-2023"లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ..ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగింది. జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది.
ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది.

అరుదైన గుర్తింపు: స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న ప్రతిపక్షాలు జగన్ పాలన పైన చేస్తున్న విమర్శలకు ఈ అవార్డు సమాధానంగా నిలుస్తోంది. పాలనా సంస్కర ణల అమల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కటం వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications