ఏప్రిల్ 20 తర్వాత ఏపీలో తొలి అనుమతులు వీటికే... ప్రభుత్వం కసరత్తు..
ఏప్రిల్ 20వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని పరిమితులతో లాక్ డౌన్ సడలించాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ఆదాయానికి కీలకంగా ఉన్న కొన్ని రంగాల్లో కార్యకలాపాలకు అనుమతించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Recommended Video

ఏప్రిల్ 20 తర్వాత ఏపీలో...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అసలే ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్ధిక పరిస్ధితి పూర్తిగా తలకిందులైంది. పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డాన చందాన తయారైన ఆర్ధిక పరిస్దితిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కేంద్రానికి సైతం తన బాధలు చెప్పుకుంది. అంతే కాదు కరోనా రెడ్ జోన్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తేయాలని కోరింది. అయితే కేంద్రం మాత్రం ఏప్రిల్ 20 తర్వాతే కొన్ని మినహాయింపులకు అంగీకరించింది. దీంతో ఇప్పుడు ఏయే రంగాలకు మినహాయింపులు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఆదాయం తెచ్చే శాఖలకే అనుమతి..
ఏప్రిల్ 20 తర్వాత ఏపీలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకువచ్చే శాఖల్లో కార్యకలాపాలకు తొలి అనుమతి లభించనుంది. వీటిలో పారిశ్రామిక రంగం అతి ముఖ్యమైనది. అర్బన్ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచే పరిస్ధితి ఎలాగో లేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలన్నీ దాదాపుగా తెరచుకోనున్నాయి. అయితే వీటిలో షిఫ్టులు, ఇతర ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అదే సమయంలో ప్రభుత్వానికి మరో ముఖ్య ఆదాయ వనరు అయిన ఇసుక తవ్వకాలకు, క్వారీ కార్యకలాపాలకు అనుమతి లభించవచ్చు. వీటితో పాటు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కార్యకలాపాలను గాడిలో పెట్టేందుకు వీటికి కూడా అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

అవి తెరవకపోతే మరిన్ని కష్టాలు..
ప్రభుత్వం ఇప్పటికే వేసుకున్న అంచనా మేరకు రెడ్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కొన్ని పరిమితులతో ఎత్తేయాల్సి ఉంది. కానీ రాష్ట్రాల వినతి మేరకు కేంద్రం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు మాత్రమే ఇచ్చింది. దీంతో ఏపీలోనూ వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. అయితే ఆదాయార్జన రంగాలకు మాత్రం మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్ధితి. కాబట్టి స్దానిక పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని కీలక రంగాల్లో కార్యకలాపాల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతోంది. ఇది కూడా జరగకపోతే ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్ధితి కూడా ఉండదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆదాయ ప్రాధాన్య రంగాలకు అనుమతి ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications