ఏపీ స్కూళ్లలో ఫస్ట్ లాంగ్వేజ్ గా సంస్కృతం ? కారణాలివే..!

ఏపీలో భారీ ఎత్తున విద్యాసంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వం.. అందులో భాగంగా స్కూళ్లలో భాషా పరమైన మార్పులు కూడా చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం...ఇప్పుడు తెలుగుతో పాటు సంస్కృతానికి కూడా
ఫస్ట్ లాంగ్వేజ్ గా మార్చబోతోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని సర్కార్ అమోదిస్తే ఇక స్కూళ్లలో సంస్కృతం ఫస్ట్ లాంగ్వేజ్ కానుంది.

పాఠశాల విద్యలో సంస్కృతం అంటే మార్కులు తెచ్చే సబ్జెక్టుగా కొన్నేళ్లుగా ఓ భావన నెలకొంది. మార్కుల కోసం హిందీకి బదులు సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం తీసుకునే వాళ్లు ఎంతో మంది ఉంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ ఆప్షన్ లో మార్పులు చేస్తూ కీలక ప్రతిపాదన ఆమోదించేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్లూ సెకండ్ లాంగ్వేజ్ లో హిందీకి ఆప్షన్ గా ఉన్న సంస్కృతం ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ కానుంది.

ap government to introduce sanskrit as first language in schools-here is details..

ఫస్ట్ లాంగ్వేజ్ గా సంస్కృతాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. దీన్ని తెలుగుతో పాటు ఆప్షన్ గా ఇవ్వనుంది. ఇలా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ గా తీసుకున్నవారు సెకండ్ లాంగ్వేజ్ లో హిందీకి బదులు తెలుగు చదవాల్సి ఉంటుంది. దీంతో ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ లుగా సంస్కృతం, తెలుగు మారతాయి. దీంతో సహజంగానే హిందీకి ప్రాధాన్యం తగ్గుతుంది. సాధారణంగా విద్యార్ధులకు ఈ లాంగ్వేజ్ ఆప్షన్లను తీసుకునే అవకాశాన్ని ఆరో తరగతి నుంచి కల్పిస్తారు.

ఈ మార్పుల వెనుక మరో కీలక కారణం ఉంది. పదో తరగతి పరీక్షా విధానంలో చేస్తున్న మార్పుల్లో భాగంగా కాంపోజిట్ తెలుగును తొలగించి తెలుగుకే వంద మార్కులు ఇచ్చారు. దీంతో గతంలో 70 మార్కులు తెలుగు, 30 మార్కులు సంస్కృతానికి ఉండేవి. ఇప్పుడు పదో తరగతిలో చేస్తున్న మార్పులతో 100 మార్కులకే తెలుగు వచ్చింది. దీంతో సహజంగానే సంస్కృతం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సంస్కృతం కావాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఫస్ట్ లాంగ్వేజ్ గానే సంస్కృతాన్ని పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+