ఏపీలో విద్యార్థులకు నారా లోకేష్ శుభవార్త... అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో వాటికోసం విద్యార్థులు ఎంతోకాలం ఎదురుచూస్తున్నారు. అవి వచ్చిన తర్వాత కళాశాలల్లో ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నప్పటికీ వారు చదువుతున్న కళాశాల యాజమాన్యం మాత్రం ఫీజులు చెల్లించాల్సిందే అంటూ ఒత్తిడి చేస్తోంది. ఓవైపు రీయింబర్స్ మెంట్ విడుదల కాక.. మరోవైపు యాజమాన్యం ఒత్తిళ్ల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యార్థులకు శుభవార్త అందుతుంది
ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ మంత్రివర్గంతోపాటు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. అతి త్వరలోనే విద్యార్థులందరికీ శుభవార్త అందుతోందని, గత ప్రభుత్వం రూ.3500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుందంటూ లోకేష్ మండిపడ్డారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. నిధుల విడుదలకు సంబంధించి బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయనివ్వమంటూ కళాశాలల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడనుంది.

GOOD NEWS SOON! 👍
— Lokesh Nara (@naralokesh) October 22, 2024
To all our student friends: The YSRCP Govt has cheated you by not paying fee reimbursement dues to the tune of Rs.3500 crores. I'm collaborating with my colleagues in the Cabinet and Ministry to resolve this issue and assure you that you'll hear good news very…
పరీక్ష ఫీజులు కట్టించుకోవడంలేదు
రానున్న నవంబరు, డిసెంబరు నెలల్లో సెమిస్టర్ పరీక్షలున్నాయి. అయితే వీటికి సంబంధించి పరీక్ష ఫీజును కళాశాలల యాజమాన్యం కట్టించుకోవడంలేదు. ఇవి కట్టించుకోవాలంటే ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. వైఎస్ జగన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఫథకాన్ని తీసుకువచ్చారని, దీన్ని ఉపయోగించుకొని ఎంతోమంది వైద్యులు, ఇంజనీర్లు తయారయ్యారని, అటువంటి పథకానికి నిధులు పెండింగ్ లో పెట్టడం సిగ్గుచేటంటూ గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకొని దాచుకోవడంపై పెట్టిన శ్రద్ధ విద్యార్థులపై పెట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications