కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం తాజా నిర్ణయం- ఇక నుంచి..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేళ కొత్త విధానాలను అమల్లోకి తెస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా దరఖాస్తులు స్వీక రించింది. అర్హత లేని వారివి తిరస్కరించింది. కొత్త కార్డుల పరిశీలన తుది కసరత్తు కొనసాగు తోంది. ఇదే సమయంలో కార్డుల పంపిణీ పై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

కసరత్తు
కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల పంపిణీ పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం 1,47,187 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 89,864 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. 38,046 మంది దరఖా స్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. కుటుంబ విభజన (స్ప్లిట్‌) కార్డుల కోసం 1,43,745 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,09,787 మందికి కొత్త కార్డులు మంజూరు చేశారు. కాగా, 20,403 దరఖాస్తులను తిరస్కరించారు. ఇలా కొత్తగా మంజూరు చేసిన దాదాపు 2 లక్షల కొత్త రేషన్‌ కార్డులలోని లబ్ధిదారులకు సెప్టెంబరు నెల నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ap-govt-all-set-to-distribute-new-ration-cards-with-qr-code-in-next-month

స్మార్ట్ కార్డులు
కొత్తగా పంపిణీ చేసే రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. రాజకీయ పార్టీల రంగులు లేకుండా, నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డులను రూపొంది స్తున్నారు. పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్‌ కార్డులుగానే ఉండనున్నాయి. బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో క్యూ ఆర్‌ కోడ్‌తో ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌరసరఫరాల శాఖ ఇప్ పటికే కసరత్తును పూర్తి చేసింది. స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కార్డుదారు (కుటుంబ పెద్ద) ఫోటో ఉంటాయి. ఆ రేషన్‌ కార్డు నంబరు, రేషన్‌షాపు నంబ రు ఉంటాయి. కార్డు వెనుకవైపు లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలు ఉండేలా డిజైన్ చేసారు.

పూర్తి సమాచారం
ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డును రేషన్‌ డీలర్ల వద్ద ఉండే ఈ-పోస్‌ యంత్రాల సహాయంతో స్కాన్‌ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలతోపాటు రేషన్‌ సరుకుల విని యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.46 కోట్లకుపైగా కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. కొత్తగా దాదాపు రెండు లక్షల కార్డులు ఇవ్వనున్నారు. అదే విధంగా.. కొత్త రేషన్ కార్డులు సంక్షేమ పథకాలకు కీలకంగా మారటంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో.. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+