ఏపిలో సిట్ లు ఏర్పాటు : డేటా దొంగిలింపు...ఫారం-7 ల‌పై : కొన‌సాగుతున్న ఫైట్‌..!

ఏపి డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే డేటా చోరీ పై తెలంగాణ ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదే స‌మ‌యంలో ఏపి ప్ర‌భుత్వం రెండు సిట్ లు ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏపి డేటా దొంగిలించార‌ని..అదే విధంగా ఫారం -7 ల‌పై మ‌రొక‌టి ఏర్పాటు చేసారు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎన్నిక ల వేళ మ‌రెన్ని ట‌ర్న్ లు తీసుకుంటుందో చూడాలి.

స‌మాచారం దొంగిలింపు పై సిట్..!
టిడిపి సభ్యత్వ సమాచారాన్ని దొంగిలించారంటూ అందిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు కోసం రవాణా శాఖ కమిషనర్‌, అదనపు డీజీపీ స్థాయి అధికారి ఎన్‌.బాలసుబ్రమణ్యం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది పోలీసు అధికారులను సభ్యులుగా నియమించింది. వీరిలో ఒకరు ఐజీ స్థాయి, ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు.సైబర్‌ నేరాల విభాగం నిపుణులను సభ్యులుగా నియమించారు.

AP Govt appointed Two SIT teams : Telangana SIT started investigation

వైసిపి నాయకులు, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కొంతమంది సీనియర్‌ పోలీసు అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులు, ఇతరులు తెదేపా సభ్యత్వాల సమాచారాన్ని నేరపూరిత కుట్రతో దొంగలించారంటూ తెదేపా ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు రెండు రోజుల కిందట గుంటూరు ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు పరిశీలించిన అనంతరం కేసు నమోదు కోసం ఎస్పీ ఆ వివరాలను తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పంపించారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

నకిలీ దరఖాస్తుల కేసుల దర్యాప్తునకు సిట్‌
ఆంధ్రప్రదేశ్‌లో అర్హుల ఓట్ల గల్లంతుకు కుట్ర పన్నినవారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది. ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ సత్యనారాయణ ఈ బృందానికి సారథిగా వ్యవహరించనున్నారు. మరో ఏడుగురు అధికారులను సిట్‌లో సభ్యులుగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రేంజి ఐజీ ఆర్‌.కె.మీనా, విశాఖపట్నం రేంజి డీఐజీ జి.పాలరాజు, ఏలూరు రేంజి డీఐజీ త్రివిక్రమ్‌వర్మ, కర్నూలు రేంజి డీఐజీ డి.నాగేంద్రకుమార్‌, అనంతపురం రేంజి డీఐజీ క్రాంతి రాణా టాటా, గుంతకల్లు రైల్వే ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ ఎ.రాజేంద్రలతో సిట్‌ ఏర్పాటు చేసింది.

AP Govt appointed Two SIT teams : Telangana SIT started investigation

రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొన్ని రాజకీయ పక్షాల్లోని నాయకులు, కార్యకర్తలు, కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేశారు. మోసపూరితంగా దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం తరఫున తహసీల్దార్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 కేసులు పెట్టారు. వీటిలో 232 కేసులకు సంబంధించి 2,300 మంది దరఖాస్తుదారులను కూడా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం కేసుల దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు బృందాలు ఈ రోజు న ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+