ప్రధాని పర్యటన వేళ అమరావతి రైతుల అరుదైన ఆహ్వానం..!!

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి పనుల రీ లాంఛ్ కోసం ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారు. మే 2న ప్రధాని అమరావతి షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందింది. ప్రధాని పర్యటన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారీ బహిరంగ సభకు నిర్ణయించింది. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీ నియమించింది. ఇక, ప్రధాని పర్యటన వేళ రైతులు.. మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమాయత్తం అవుతున్నారు.

ప్రత్యేక కమిటీ
ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వం మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ నియమించింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా వీర పాండ్యన్ ​ను నియమించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది. ప్రధాని పర్యటన వేళ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ap-govt-appoints-organizing-committee-for-pm-modi-amaravati-tour

పూలతో రైతుల స్వాగతం
మోదీ సభకు సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునే లా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా ప్లానే చేస్తున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరాతి పనులను ప్రధాని మోదీ ప్రారంభించ నున్నారు. సచివాల యం వెనక ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ వేదిక వద్ద నుంచే పనులను ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదార్ల ను గుర్తించారు. పీఎం మోదీతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరం కాగా, సచివాలయం ఎదుట ఇప్పటికే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేస్తున్నారు. హెలీప్యాడ్‌ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి పీఎం మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకేలా నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+