పాలమూరు రంగారెడ్డిపై కేంద్రాన్ని ఇరికిస్తున్న ఏపీ ప్రభుత్వం; కేంద్రం వైఖరి చెప్పాలంటూ ఎన్జీటీలో వాదన!!
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఏపీ సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బలంగా తన వాదనలు వినిపిస్తుంది. ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్రం వైఖరి చెప్పాలంటూ మెలిక పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుందని, దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పర్యావరణ హాని కలుగుతుందని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ బలంగా వాదనలు వినిపిస్తుంది. అక్టోబరు 7వ తేదీన కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగనుంది.
Recommended Video

పాలమూరు రంగారెడ్డిపై కేంద్రవైఖరి చెప్పాలన్న ఏపీ ప్రభుత్వం
జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసం ఈ ప్రాజెక్టును చేపట్టిందని, తాగునీటి ప్రాజెక్టు పేరుతో పర్యావరణ అనుమతులను తీసుకోకుండా పనులు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రం తన వైఖరిని వెంటనే చెప్పాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. అయితే కేంద్రం తరపు న్యాయవాది స్పందిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, తుది విచారణలో తప్పకుండా కేంద్రం వైఖరి వెల్లడిస్తామని ధర్మానికి తెలియజేశారు.

ఏపీ పిటీషన్లు విచారణార్హం కాదన్న తెలంగాణా అడ్వకేట్ జనరల్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాదనపై ప్రతి వాదనలు వినిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుందని ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించకూడదని పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమైనదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఏపీ రైతుల పిటిషన్ ప్రవేశ సమయంలోనే విచారణకు నిరాకరించారని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసి కూడా వారు కావాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారని తెలిపారు .

పాలమూరు రంగారెడ్డి , డిండి ఎత్తిపోతల కూడా ఆపాలని ఏపీ విజ్ఞప్తి
2015 లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి ప్రాజెక్టు కోసం మాత్రమే నిర్మాణం చేపట్టామని, రెండవ దశలో సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు కోరామని, పర్యావరణ అనుమతులు వచ్చేవరకూ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేయబోమని రామచందర్ రావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలకు పాల్పడిన తెలంగాణ, డిండి ఎత్తిపోతల పథకానికీ జలశక్తి శాఖ అనుమతులు తీసుకోలేదని, అక్రమంగా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళ్ళింది.

శ్రీశైలం జలాశయానికి నీరు రాకుండా నీటి మళ్ళింపు చేసేలా ఉన్నారన్న ఏపీ
తాగునీటికోసం 67 టీఎంసీలు కావాలని తెలంగాణ చెబుతుందని పేర్కొన్నారు . ఒక్క టీఎంసీ నీరు 5 లక్షల మందికి సరిపోతుందని 67 టిఎంసిల నీరు నిల్వ చేయడమే కాకుండా భారీ స్థాయిలో రిజర్వాయర్లను నిర్మించి కృష్ణా జలాలను మళ్లిస్తే దిగువన వున్న మాకు నీరే అందదని ఏపీ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది. శ్రీశైలం జలాశయానికి నీరు రాకుండా పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీటిని అక్రమంగా మళ్ళించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్ళింది. ఇదే సమయంలో తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం వైఖరి ఏమిటో చెప్పకుండా ఆదేశాలు ఇవ్వద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం అటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టడమే కాకుండా, కేంద్రాన్ని కూడా ఈ వ్యవహారంలోకి లాగుతూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications