Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీఎంఆర్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం అప్పగింత.. త్వరలో పనులు ప్రారంభం..

ఏపీలో ప్రతిష్టాత్మక భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని జీఎంఆర్ గ్రూపుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఎల్ఓఏ జారీ చేసింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఈ నిర్మాణాన్ని జీఎంఆర్ చేపట్టనుంది. దేశ, విదేశాల్లో ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేసిన అనుభవం ఉన్న జీఎంఆర్ సంస్ధ... గతేడాది బిడ్డింగ్ లో కాంట్రాక్టు దక్కించుకుంది. మూడేళ్లలో దీని నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ కు...

భోగాపురం ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ కు...

విమానాశ్రయాల నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం కలిగిన జీఎంఆర్ గ్రూపు గతేడాది కాంపిటీటివ్ బిడ్గింగ్ లో విజయనగరం, విశాఖ జిల్లాల మధ్యన ఉన్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకుంది. విశాఖపట్న నుంచి 45 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతం భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం శంఖుస్ధాపన చేసింది. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ సంస్ధ కాంట్రాక్టు దక్కించుకుంది.
గతంలో హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు, మరెన్నో దేశ విదేశీ విమానాశ్రయాల నిర్మాణం చేసిన ఘనత జీఎంఆర్ సంస్ధది.

 మూడేళ్లలో నిర్మాణం పూర్తి..

మూడేళ్లలో నిర్మాణం పూర్తి..

పీపీపీ విధానంలో కాంట్రాక్టు దక్కించుకున్న జీఎంఆర్ గ్రూప్ కు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ సర్కారు తాజాగా లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేసింది. దీంతో నిర్మాణం ప్రారంభించేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చినట్లయింది. కాంట్రాక్టు నిబంధనల మేరకు జీఎంఆర్ సంస్ధ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రారంభించి 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

40 ఏళ్లకు నిర్వహణ బాధ్యతలు.

40 ఏళ్లకు నిర్వహణ బాధ్యతలు.

విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఉన్నా ఇది తూర్పు నావికా దళం చేతిలో ఉండటంతో రక్షణ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఎయిర్ ట్రాపిక్ కు కూడా ఇబ్బందులు కలుగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ-విజయనగరం జిల్లాలకు అత్యంత సమీపంలో భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. పీపీపీ విధానంలో నిర్మాణం తర్వాత 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా జీఎంఆర్ సంస్ధ నిర్వహిస్తుంది. అంతర్జాతీయ కాంట్రాక్టు బిడ్డింగ్ నిబంధనల ప్రకారం ఈ గడువు మరో 20 ఏళ్లు పొడిగించేందుకు కూడా అవకాశం ఉంటుంది.

Recommended Video

    PM Modi Address Nation By Tomorrow 10 AM, Following Jagan on Lock Down Extension
    విశాఖ రాజధాని రాకతో మేలు..

    విశాఖ రాజధాని రాకతో మేలు..

    భోగాపురంలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం ఎయిర్ పోర్టు ట్రాఫిక్ తో పాటు కార్గోను కూడా ఇక్కడికి మళ్లించేందుకు వీలు కలుగుతుంది. గతేడాది విశాఖపట్నం ఎయిర్ పోర్టు ద్వారా 27 లక్షల పాసింజర్ రవాణాతో పాటు 4400 మెట్రిక్
    టన్నుల కార్గో రవాణా కూడా జరిగింది. గత ఐదేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికుల రవాణా 21 శాతం పెరిగింది. ఇప్పుడు రాజధాని రాకతో ఆ సంఖ్య మరింత పెరగనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+