ఏపీలో కొత్త పెన్షన్లు, వీరికే అవకాశం - మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్దం చేసింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. వచ్చే నెల తొలి వారం లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేందుకు రంగం సిద్దం అవుతోంది.

ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు ఆమోదం తెలిపింది. సెర్ప్ అధికారుల నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు. కాగా, 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన సరే పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు.

ap-govt-decided-to-issue-spouse-pensions-for-eligible-beneficiaries

అనర్హులకి తొలగింపు
పెన్షన్ల మంజూరు సమయంలోనూ అనర్హులను తెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్‌ సదరం ధ్రువీకరణ పత్రాలు కోకొల్లలుగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి రూ.30 వేల వరకు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీ అసెస్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేయిస్తోంది. స్పౌజ్ పింఛ‌న్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో స్వీకరించనున్నారు. అర్హులు ఈ నెల 30లోపు ఈ వివ‌రాలు స‌మ‌ర్పిస్తే... మే 1వ తేదీన పింఛ‌న్ డ‌బ్బులు అందుకోవ‌చ్చు. ఆలోపు న‌మోదు చేసుకోలేనివారికి జూన్ 1వ తేదీ నుంచి చెల్లించ‌డం జ‌రుగుతుంది. కాగా, తాజా నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంపై నెల‌కు రూ. 35.91కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంది.

నేటి నుంచి దరఖాస్తులు
ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది. ఇక.. జులై నెల నుంచి కొత్త పింఛన్ల మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించనుంది. అనంతరం ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద దాదాపు 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో అనేక కారణాలలో పెన్షన్లు నిలిచిపోయిన వారికి ఉపశమనం దక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+