వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వేళ జగన్ మానవత్వం.. 60 వేల కాంట్రాక్ట్, ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ అన్ని రంగాలు మూతపడ్డాయి. ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. రూపాయి పుట్టడమే గగనమైపోతోంది. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు చెల్లిస్తే చాలన్నట్లుగా ఉంది ప్రభుత్వాల పరిస్దితి. అలాంటిది రూపాయి ఖర్చు తగ్గుతుందంటే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్దితి. కానీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పట్ల మానవత్వాన్నే ప్రదర్శిస్తోంది.

ap govt extends contract and outsourcing employees tenure for two months

ఏపీలో దాదాపు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, మరో 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ రేపటితో ఉద్యోగ గడువు ముగిసిపోనుంది. ప్రభుత్వం వీరితో కుదుర్చుకున్న ఒప్పందం ఏప్రిల్ 30తో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా వీరిని కొనసాగించడం ఏమాత్రం సాధ్యం కాదు. కానీ సీఎం జగన్ మాత్రం వీరి కొనసాగింపుకే మొగ్గు చూపారు. మరో రెండు నెలల పాటు అంటే జూన్ 30వ తేదీ వరకూ వీరిని కొనసాగించేలా ఆదేశాలు ఇచ్చారు. తద్వారా దాదాపు 50 వేల కుటుంబాలకు రెండు నెలల పాటు లబ్ది కలగనుంది.

English summary
andhra pradesh govt decided to continue contract and out sourcing employees for next two months in wake of coronavirus outbreak. as of now approximately 12k contract and 50k out sourcing employees working in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X